కదిలే కారులోనే రేప్ చేసారంటూ కేసు పెట్టిన కాజల్!

Kajal puts rape case on businessman

10:29 AM ON 17th June, 2016 By Mirchi Vilas

Kajal puts rape case on businessman

మామూలుగా ఎవరైనా అమ్మాయి తనను రేప్ చేసారని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే, అతని పై నిర్భయ కేసు పెట్టడం ఖాయం. శిక్ష పడడం ఆ పై జైలుకి వెళ్లడం పరిపాటి. ఇక అలానే ఢిల్లీకి చెందిన కాజల్ అనే కిలాడి.. ఒక డబ్బున్న యువ వ్యాపారవేత్త పై రేప్ కేసు పెట్టేసింది. అతనితో పాటు అతని స్నేహితుడు తనను కదులుతున్న కారులో రేప్ చేసారని కేసు పెట్టింది. అతన్ని అరెస్టు చేసి, తదుపరి చర్యలకు పోలీసులు ప్రిపేర్ అయ్యారు. అయితే, కాజల్ స్నేహితుడు కిషన్ తమ ప్లాన్ గురించి చెబుతుండగా, రికార్డు చేసిన ఆడియో క్లిప్ రక్షణ కవచమైంది. ఇంటరెస్టింగ్ గల ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..

తప్పుడు అత్యాచార ఆరోపణలు చేస్తూ, నింధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బులాగి, కేసును పరిష్కరించుకున్నామని చెబుతూ, మరొకరిని ఉచ్చులో బిగించడం కిలేడీ కాజల్ చేసే పని. అమెకు స్నేహితుడు కిషన్ సహకరిస్తుండేవాడు. అయితే యువ వ్యాపారవేత్తకి స్నేహితురాలైన ఓ యువతి, కిషన్ వద్దకు వెళ్లి కాజల్ గురించి అడిగి తెలుసుకుని షాక్ కి గురయింది. తప్పుడు ఆరోపణలను చేయడం ద్వారా కనీసం 15 లక్షల రూపాయలు వరకూ గుంజాలన్నది కాజల్ ప్లాన్ అని, ఆమె గతంలోనూ ఇలా చేసిందని ఆడియోలో కిషన్ చెప్పాడు. ఓ లగ్జరీ కారును ఎంచుకుని ఆపి లిఫ్ట్ అడిగి, అత్యాచార ఆరోపణలు చేయడం, నష్టపరిహారానికి డిమాండ్ చేసి డబ్బులెలా వసూలు చేస్తామన్నది పూస గుచ్చినట్టు చెప్పాడు.

కిషన్ తో ఆ కిలాడి మాట్లాడిన మాటల ఆడియో సంపాదించి, పోలీసులకు ఇచ్చింది. దీంతో పోలీసులు కూడా ఆ కిలాడీ గురించి తెలుసుకుని విస్తుపోయారు. అంతే వ్యాపారవేత్తను వదిలేసి కాజల్ పై కేసు పెట్టారు. ఆడియో ఆధారంగా కాజల్ పై విచారణ చేస్తున్నారు.

English summary

Kajal puts rape case on businessman