మొహమాటానికి పొతే ఇక అంతే    

Kajal Says How To Select Movies

03:33 PM ON 12th February, 2016 By Mirchi Vilas

Kajal Says How To Select Movies

ఈ మధ్య కాలంలో క్రేజీ మూవీలను చేస్తున్న స్టార్ హీరోయిన్ కాజల్, డైరెక్టర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిందట. ప్రస్తుతం ఈ 30 ఏళ్ల బ్యూటీ పై జోరుగానే సాగుతున్న టాక్ ఇది. కాజల్ ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం వంటి భారీ కాంబినేషన్ మూవీలతో పాటూ హిందీ లో రణదీప్ హుడా సరసన “దొ లఫన్జోంకి కహానీ” లోనూ నటించింది. ఇంతకీ ఎవరి మీద కామెంట్లు చేసింది అనే విషయంలోకి వెళితే, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరుస సినిమాలు చేసి భారీ ప్లాపులను చూసి న ఈ ముగ్గుగుమ్మ, గత అనుభవాల దృష్ట్యా, ఇప్పుడు ఎటువంటి కథలను చేయాలి అన్నదానిపై ఓ క్లారిటీకి వచ్చిందట. సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగడానికి చాలా సీక్రెట్స్ ఉంటాయని చెబుతోంది. ముఖ్యంగా మొహమాటం కోసం పోయి కథలను ఒప్పుకుంటే…తరువాత ప్లాపు లే మిగులుతాయని అంటోందట. 'కెరీర్ తొలిరోజుల్లోనూ ఎవరు కథ చెప్పినా, భలే చాన్సులే అన్నట్టు ఒప్పుకునే దాన్ని. ఫలితంగా కెరీర్ పరంగా ఎంతో నష్టపోయా. అయితే నా మీద నమ్మకంతో ఇండస్ట్రీ లో వరుస మూవీలను ఇవ్వటంతో సెటిల్ అయ్యా. అందుచేత, ఇక మొహమాటానికి పోరాదు' ఇదండీ ఈ అందాల భామ చెప్పే సీక్రెట్. ఇక టాలీవుడ్ లో చాలా మంది డైరక్టర్స్ వారి కథ ఎలా ఉన్నప్పటికీ, ఏదొక విధంగా నటించాలి అన్నట్టుగా కన్విన్స్ చేస్తారట. అలాంటి మూవీల్లో తను నటించినప్పటికీ చాలా మూవీలు ప్లాప్ గా నిలిచాయట. ఇక నుండైనా అటువంటి కథలతో తన వద్దకు రాకుంటేనే మంచిదని కాజల్ అనడం ద్వారా డైరెక్టర్స్ పై పరోక్షంగా విసిరిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఏది ఏమైనా మొహమాటానికి పోకూడదని బలంగా నిర్ణయించుకుందని అంటున్నారు.

English summary

Kajal Agarwal says about her secrets. Kajal said that she was doing less number of movies. Kajal said earlier she used to accept all top offers in Tollywood . But now She decided to select performance oriented roles. She said everyone hopes to select good stories but sometimes they may not be successful.