బాలయ్యకు నో చెప్పిన హీరోయిన్‌

Kajal Says No To Balakrishna Movie

10:13 AM ON 19th April, 2016 By Mirchi Vilas

Kajal Says No To Balakrishna Movie

నందమూరి నట సింహం యువరత్న బాలకృష్ణ ఇప్పటి వరకు 99 సినిమాలు చేసాడు , బాలయ్య వందవ సినిమాకు ఎన్నడు లేనంత గా ఏర్పాట్లు శర వేగంగా జరుగుతున్నాయి. ఉగాది పండుగ సందర్భంగా బాలయ్య తన 100 వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే . బాలయ్య వందో సినిమాకు అనేక మంది డైరెక్టర్ల పేర్లు ముందుకు వచ్చినప్పటికీ ఆఖరికి క్రిష్ ను కన్ఫార్మ్ చేసాడు బాలయ్య . ఈ సినిమాకు దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు . బాలకృష్ణ తన వందో సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తుండడం మరో విశేషం .

ఇవి కూడా చదవండి: మన క్రికెటర్ల చదువు ఎంతో తెలుసా.?
ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట బాలయ్య తో సింహ , శ్రీరామరాజ్యం వంటి సినిమాలలో నటించిన నయనతారను అనుకున్నప్పటికి కొన్ని అనివార్య కారణాల వల్ల నయన్ ను పక్కన పెట్టారు . తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్‌ అగర్వాల్ ను సంప్రదించగా ఆమె నో చెప్పిందని వార్తలొస్తున్నాయి. కాజల్ డేట్ లు ఖాళి గా లేవని చెప్పిందట . కాని ఇటీవల రానాతో సినిమా చేసేందుకు కాజల్‌ ఒప్పుకుందట , కాని బాలకృష్ణ సినిమాకు మాత్రం డేట్ లు లేవని చెప్పడం కొసమెరుపు . ప్రస్తుతం బాలయ్య 100 వ సినిమాకు మరో హీరోయిన్‌ ను వెతికే పనిలో పడిందట ఆ చిత్ర యూనిట్ . రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సరసన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాజల్ త్వరలో ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇవి కూడా చదవండి:

తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 ఫస్ట్ వీక్ కలెక్షన్స్

చిరు 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమా అని రైటర్స్ ని ఒత్తిడి పెట్టొద్దు

English summary

Bala Krishna was presently busy with his 100 th movie. Bala Krishna was announced that he was going to act under the direction of Director Krish. Recently a news came to know that Kajal Rejected Heroine role in Bala Krishna 100 th movie because of dates problem.