గ్యారేజ్ లో చందమామ అందాలు

Kajal Special song in Janatha Garage Movie

10:39 AM ON 30th July, 2016 By Mirchi Vilas

Kajal Special song in Janatha Garage Movie

క్రేజీ దర్శకుడు శివ కొరటాల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ హీరోగా చురుగ్గా నిర్మాణమవుతున్న జనతాగ్యారేజ్ లో తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తోందని ఇప్పటివరకూ వినిపించిన మాట. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తమన్నా ప్లేస్ లో చందమామ కాజల్ ని తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రీ క్లైమాక్స్ లో ఈమెతో ఎన్టీఆర్ కు స్పెషల్ సాంగ్ వుండనున్నట్లు యూనిట్ మేకర్స్ అంటున్నారు.

ఇంతకీ ఈ మార్పుకి అసలు కారణం వెతికితే, తమన్నాతో జూనియర్ కి అస్సలు కలిసిరాలేదట. ఈ క్రమంలో కాజల్ పేరు వెలుగులోకి తెచ్చినట్లు చెబుతున్నారు. ఆమెతో జూనియర్ కి హిట్టయిన సినిమాలు లేకపోలేదు. బృందావనం, బాద్ షా, టెంపర్ వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద విజయం సాధించడం దీనికి కారణంగా చెబుతున్నారు. మొత్తానికి తెలుగు, హిందీ చిత్రాలు ప్లాపయిన తర్వాత చేస్తున్న మూవీ ఇదే కావడంతో కాజల్ బోల్డన్ని ఆశలు పెట్టుకుందని అంటున్నారు. ఈ విధంగానైనా కాజల్ కు గ్యారేజ్ బూస్ట్ అప్ ఇస్తుందని కూడా అంచనా వేస్తున్నారు.

ఇక గ్యారేజ్ లో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు వున్నారని, వాళ్లతో స్పెషల్ సాంగ్ చేయించే బదులు, కొత్త బ్యూటీ అయితే బాగుంటుందని డైరెక్టర్ కొరటాల సలహా ఇచ్చాడట. ఆ తర్వాత యూనిట్ కాజల్ ని అప్రోచ్ కావడం, ఆమె ఒకే చెప్పడం అయినట్లు ఇన్ సైడ్ టాక్. కానీ ఇవేమీ తెలియని వాళ్ళు వున్నట్లుండి తమన్నా బదులు కాజల్ గ్యారేజ్ లోకి ఎలా వచ్చిందంటూ తెగ చర్చలు చేస్తున్నారట. మొత్తానికి కాజల్ భలే ఛాన్స్ కొట్టేసిందని కూడా కొందరు అంటున్నారు.

ఇది కూడా చూడండి: మీ మనస్తత్వం ఏంటో మీరు పుట్టిన నెలతో తెలుసుకోవచ్చు

ఇది కూడా చూడండి: న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది.?

ఇది కూడా చూడండి: మీ రాశి ప్రకారం ఎ కెరీర్ లో బాగా రాణిస్తారు

English summary

Kajal Special song in Janatha Garage Movie.