కన్నడలోకి కాజల్‌ ఎంట్రీ

Kajal To Sing In Kannada

06:53 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Kajal To Sing In Kannada

తెలుగు, తమిళం, హిందీ సినీ పరిశ్రమాలతో మాత్రమే పరిచయం ఉన్న కాజల్‌ ఇప్పుడు కన్నడలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇది తెలియగానే ఎవరైనా హిరోయిన్‌ గానా అని అనుకుంటారు. కానీ కాజల్‌ ఎంట్రీ కన్నడ సూపర్‌స్టార్‌ అయిన పునీత్‌ రాజ్‌కుమార్‌ కధానాయకుడిగా నటిస్తున్న 25 వ చిత్రం చక్రవ్యూహం. ఈ చిత్రానికి తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకు తమన్‌ ఎన్టీఆర్‌ తో ఒకపాట పాడించాడు. ఇప్పుడు కాజల్‌ తో కూడా తమన్‌ ఈ సినిమాలో పాడించనున్నాడు . పునీత్‌ రాజ్‌కుమార్‌ 25వ చిత్రం చక్రవ్యూహం ని హైలెట్‌ చెయ్యడానికి తమన్‌ సెలబ్రెటీలతో పాటలు పాడిస్తున్నాడు. పునీత్‌ కి తెలుగు సెలబ్రెటీలతో మంచి అనుబంధం ఉంది. అయితే ఏ మాత్రమూ పరిచయం లేని భాషలో పాట పాడడానికి ఒప్పుకుందంటే కాజల్‌ ధైర్యానికి మెచ్చుకుని తీరాలి.

English summary

Tollywood Star heroine kajal agarwal to sing song in Kannada power star puneeth rajkumars 25 th film. This music was composed by S.S.Thamman