కళాభవన్ మరణం వెనుక షాకింగ్ ట్విస్ట్‌లు

Kalabhavan Mani drunk alcohol before day night with his friends

09:48 AM ON 10th March, 2016 By Mirchi Vilas

Kalabhavan Mani drunk alcohol before day night with his friends

దక్షిణాది సినీరంగంలో వైవిధ్య భరితమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు కళాభవన్ మణి మరణ మిస్టరీ కొనసాగుతోంది. మణి 1971 జనవరి 1న జన్మించారు. ఆయనకు భార్య - కూతురు ఉన్నారు. రిక్షా డ్రైవర్ గా పనిచేస్తూనే.. కేరళలో గొప్ప కళాకారులను అందించిన కళాభవన్ లో మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆ కళాభవన్ పేరునే ఇంటిపేరుగా చేసుకున్నారు. హాస్య నటుడిగా 'అక్షరం' సినిమాతో మలయాళ సినీరంగానికి పరిచయమైన మణి. 25కు పైగా చిత్రాల్లో పాటలు పాడాడు. మలయాళం-తమిళం-తెలుగులో 200 చిత్రాలకుపైగా నటించాడు. అయితే అకస్మాత్తుగా మరణించడం పై ట్విస్ట్ ల పరంపర కొనసాగుతోంది.

ఊపిరితిత్తులు-కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కోచిలో మృతిపై పోలీసులు అనుమానస్పద మృతి కేసు నమోదు చేసారు. పెద్ద మొత్తంలో ఆల్కాహాల్ సేవించడం వల్ల మణి అనారోగ్యం పాలైనట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. అయితే తాజాగా మరో ఎపిసోడ్ తెర మీదకు వచ్చింది. మణి స్నేహితుడు-సినీ నటుడు జప్పర్ ఆసక్తికర అంశాలు వివరించాడు. "మరణానికి ముందురోజు మణికి చెందిన ఫామ్ హౌజ్ లో తామంతా కలిసి పార్టీ చేసుకున్నాం. ఇందులో మణి స్నేహితులు-బంధుమిత్రులు కూడా ఉన్నారు. నేను ఆ సందర్భంగా సినిమా గురించి చర్చించా.

అక్కడ తామంతా ఎంత వద్దన్నా నేను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పిన మణి బీర్ తాగాడు ఆ తర్వాత అనుకోకుండా మరణించడం ఆవేదన కల్గిస్తోంది అని జప్పర్ పేర్కొన్నాడు. మణి అనారోగ్యంతో చనిపోయాడని భావించడం లేదని అలాగని ఆయన్ను చంపేవారు ఉంటారని కూడా అనుమానించడం లేదని జప్పర్ చెబుతూ, తాను దగ్గరిగా గమనించిన మణి ఆత్మహత్య చేసుకునేంత సున్నిత మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదని కూడా జప్పర్ అంటున్నాడు. అయితే మణి మృతి విషయంలో వాస్తవాలు వెల్లడి కావాలంటే పోలీసులు దర్యాప్తు చేయాలన్నారు.

మణి సోదరుడు రామకృష్ణన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పిన స్థానిక పోలీస్ అధికారి పోస్ట్ మార్టం రిపోర్టు-మెడికల్ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కొచ్చిలో ఆయన మరణాన్ని ద్రువీకరించిన అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నివేదిక కూడా కీలకమని అంటున్నారు.

English summary

Kalabhavan Mani drunk alcohol before day night with his friends and relatives. Actually his friends told to him that don't drink alcohol.