కళాభవన్ మణి పై విషప్రయోగం జరిగింది!

Kalabhavan Mani killed by poison

12:43 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Kalabhavan Mani killed by poison

విక్టరీ వెంకటేష్ నటించిన జెమిని చిత్రంలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన మలయాళ నటుడు కళాభవన్ మణి మార్చి లో ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అయన మరణం పై పలు అనుమానాలున్నాయని అప్పుడు వాదనలు కూడా వినిపించాయి. దాంతో అయన మృతి పట్ల పోలీసులు దర్యాప్తు వేగం చేసారు. అయితే తాజాగా విడుదలైన ఫోరెన్సిక్ రిపోర్ట్ తో ఆ అనుమానాలు బలపడ్డాయి. అయన బాడీలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ ఉందని ఈ నివేదిక ఇచ్చింది. హైదరాబాద్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబ్స్ నిర్వహించిన టెస్ట్ లో ఇది రుజువైంది.

అయితే ఇది వరకే కొచ్చిలో ఇచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్ లో అయన బాడీ లో క్లోరో ఫిరిపోస్ అవశేషాలు ఉన్నట్టు రిపోర్ట్ ఇచ్చారు. కానీ హైదరాబాద్ టెస్ట్ లో మాత్రం ఇలాంటిది ఎం లేదని, మిథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పడం సంచలనం కలిగించింది. మరి అయన పై హత్యాయత్నం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తమ అభిమాన నటుడి మృతి పట్ల విషాదాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు..

English summary

Kalabhavan Mani killed by poison