బిజేపి ని వీడిన కలాం వారసుడు

Kalam Nephew Quits BJP

05:43 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

Kalam Nephew Quits BJP

మాజీరాష్ట్రపతి స్వర్గీయ ఎపిజే అబ్దుల్‌ కలాం వారసుడు బిజెపిని విడాడు. అబ్దుల్‌ కలాం సొదరుని కొడుకైన హజ సయ్యద్‌ ఇబ్రహీం బిజేపికి స్వస్తి పలికాడు.

ఎపిజె అబ్దుల్‌ కలాంకు ఢిల్లీ లోని రాజాజీ మార్గ్‌లో రెండు బంగ్లాలు ఉన్నాయి. ఐతే ఆ బంగ్లాను కలాం స్మారక భవనం గా ఉంచాలన్నఇబ్రహీం అభ్యర్ధనను పట్టించుకోకుండా కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రికి కెటాయిండం పై అవేదన చెందిన ఇబ్రహీం బిజేపికి స్వస్తి పలికారు. తన రాజీనామా లేఖపై ఇబ్రహీం మాట్లాడుతూ కలాం నివసించిన బంగ్లాను నేషనల్‌ నాలెడ్జ్‌ సెంటర్‌గా మార్చమని భారత ప్రజలు,తమ కుటుంభం చేసిన అభ్యర్ధనను ప్రభుత్వం పట్టించుకోకుండా మంత్రి మహెష్ శర్మ కు కేటయించటం పై అవేదన వ్యక్తం చేసారు.

యువతకు,దేశానికి ఆదర్శమైన కలాం ను ప్రభుత్వం గౌరవించడం లేదని ,దేశానికీ ఎంతో సేవ చేసి భరత్ ను అంతర్జాతీయ స్థాయిలో నిలబడడానికి నిరంతరం కృషి చేసిన కలాం ను ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. భారత ప్రజల డిమాండ్‌ నేరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని అందుచేత తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.

English summary

Ex-President Of India APJ Abdul Kalam's nephew quits BJP For Alloting Kalams Banglow For Minister Mahesh Sharma.He asks government of India to make that building as National Knowledge centre but government of india refused his words and alloted it for Minister Of State Culture and Tourism.