దీనావస్థలో కత్తి కాంతారావు ఫ్యామిలీ

Kalaprapoorna Kantharao family on road

03:00 PM ON 13th June, 2016 By Mirchi Vilas

Kalaprapoorna Kantharao family on road

జానపద చిత్రాల పేరు చెబితే కాంతారావు పేరు ఠక్కున గుర్తొస్తుంది. ఎందుకంటే అలనాటి హీరోలలో కాంతారావుగారికంటూ ప్రత్యేకత ఉంది. ఆయన జానపద చిత్రం చేసారంటే అది ఖచ్చితంగా హిట్ కొట్టేది. ఆయన ఒకప్పుడు కత్తి పట్టి తిప్పారంటే సినిమా ఖచ్చితంగా కాసులు కురిపించేది. ఎన్టీఆర్, ఏఎన్నార్ రేంజిలో కాంతారావు గారు అప్పట్లో సినీ అభిమానులను మెప్పించారు. అది గతం.. ఇప్పుడు కాంతారావు ఫ్యామిలీ చాలా దీనావస్థలో ఉంది. ఆర్థికంగా చాలా దీనావస్థలో కాంతారావుగారి కుటుంబం ఉంది. ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చిన ప్రముఖ లాయర్, నటుడు నరసింహారావు, కాంతారావు ఫ్యామిలీని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇప్పటికే కొందరు దాతలు తమవంతుగా సాయం అందించారు. ఆమెకు ఆర్ధిక సహాయం చేయదలచినవారు కింది అకౌంట్ లో డబ్బులు వేయాలని నరసింహారావు సూచించారు. మరి మా స్పందన ఉంటుందా లేదా అని కొందరు అంటున్నారు. చూద్దాం.

English summary

Kalaprapoorna Kantharao family on road