కలియుగాంతంలో మనుషుల ప్రవర్తన ఇలా ఉంటుందట

Kaliyuga coming to end

03:40 PM ON 1st September, 2016 By Mirchi Vilas

Kaliyuga coming to end

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రకారం కలియుగం అంతం అవుతుందని వింటూ ఉంటాం. ఎందుకంటే కలియుగం అంతం అయ్యే సమయంలో వీర భోగ వసంతరాయులుగా వస్తానని బ్రహ్మగారు చెప్పినట్లు అంటుంటారు. ఇక కలియుగాంతం గురించి కొన్ని సినిమాలు వచ్చాయి. కొన్ని కథలు, పురాణ గాధలు ఎన్నో ఉన్నాయి. ఈ యుగం అంతమైతే.. భూమ్మీద మనుషుల మనుగడ ఉండదని వివరిస్తుంది. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికే అంతమయ్యాయని చెబుతూ ఉంటారు. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటికే కొన్ని సంకేతాలు కలియుగాంతాన్ని సూచిస్తున్నాయని పెద్దలు చెబుతూ ఉంటారు.

కలియుగం అంతరించే సమయం దగ్గర్లోనే ఉందని, జరుగుతున్న పరిణామాలే అందుకు కారణమని వివరిస్తున్నారు. అయితే కలియుగాంతాన్ని హెచ్చరించే ఆశ్చర్యకర సంకేతాలు ఎలా ఉంటాయని కొన్ని అధ్యయనాలు ఇలా వివరిస్తున్నాయి..

1/17 Pages

మనుషుల తీరులో చాలా మార్పులు కనిపిస్తాయి. మనుషులకు మతం, యదార్థం, సహనం, శుభ్రత, దయ, ఆయుష్షు, శారీరక శక్తి, జ్ఞాపకశక్తి వంటివన్నీ రోజురోజుకీ తగ్గిపోతాయి. ఇవన్నీ కలియుగాంతాన్ని సూచించే పరిణామాలే.

English summary

Kaliyuga coming to end