ఫ్లిప్‌కార్ట్‌తో కల్యాణ్‌ జువెలర్స్‌ జట్టు

Kalyan Jewellers Ties up With Flipkart

12:51 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Kalyan Jewellers Ties up With Flipkart

ప్రముఖ జువెలరీ బ్రాండ్‌ కల్యాణ్‌ జువెలర్స్‌ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో జట్టు కట్టింది. ఇకపై ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ద్వారా బంగారు, వజ్రాభరణాలు అమ్మనుంది. ఫిబ్రవరి 12 నుంచి కల్యాణ్‌ జువెలర్స్‌ ఆభరణాలు ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. కల్యాణ్‌ జువెలర్స్‌ బంగారు, వజ్రాభరణాలలో రూ.3,500 నుంచి రూ.2 లక్షల వరకు ఉంగరాలు, పెండెంట్స్‌, చెవిదిద్దులు, నెక్లెస్‌లు ఫ్లిప్‌కార్టు ద్వారా కొనుక్కోవచ్చని వెల్లడించింది. ఆన్‌లైన్‌లో బంగారు ఆభరణాల కొనుగోళ్లు పెరుగుతున్నాయని, ఏడాదికి 70 శాతానికి పైగా ఆన్‌లైన్‌ బిజినెస్‌ పెరుగుతుండడంతో ఈ-కామర్స్‌ పోర్టల్‌ ద్వారా వినియోగదారులకు చేరువవుతున్నట్లు కల్యాణ్‌ జువెలర్స్‌ ఛైర్మన్‌ ఎండీ టీ ఎస్‌ కల్యాణరామన్‌ తెలిపారు.

English summary

Kalyan Jewellers enters e-commerce market via Flipkart to sell jewellery. Kalyan Jewellers will sell gold and diamond jewellery on Flipkart. Company officials said that the products will be available from February 12th.