నందమూరి 'మెగా' హీరోల మల్టీస్టారర్

Kalyan Ram and Sai Dharam Tej to act in a Multi Starrer Film

11:04 AM ON 8th August, 2016 By Mirchi Vilas

Kalyan Ram and Sai Dharam Tej to act in a Multi Starrer Film

ఒకప్పడు మల్టీ స్టారర్ చిత్రాలకు కొదవ ఉండేది కాదు. ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో నందమూరి, మెగా హీరోల తొలి కలయికతో ఓ మల్టీస్టారర్ స్టార్ట్ కాబోతోంది. కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో రానున్న ఈ మూవీని ఏ.ఎస్.రవికుమార్ డైరెక్ట్ చేయ బోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ ని సెట్ చేసింది కల్యాణ్ రామేనని కూడా అంటున్నారు.

డైరెక్టర్ రవికుమార్ ఇటీవల కళ్యాణ్ రామ్ కి ఓ స్టోరీ చెప్పగా.. అది బాగా నచ్చడంతో కళ్యాణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసింది. అంతేకాదు, ఆ స్టోరీలో వున్న మాస్ రోల్ కి సాయి ధరమ్ కరెక్ట్ గా సరిపోతాడని సజెస్ట్ చేశాడని.. దాంతో రవికుమార్ రీసెంట్ గా సాయి ధరమ్ ని కలసి స్టోరీ చెప్పాడని అంటున్నారు. తనకు పిల్లా నువ్వులేని జీవితం తో మంచి హిట్ ఇచ్చిన రవికుమార్ చెప్పిన స్టోరీ బాగా నచ్చి వెంటనే సాయిధరమ్ ఓకే చెప్పాడట.

ఈ ఇద్దరు హీరోలు పచ్చజెండా ఊపెయ్యడంతో డైరెక్టర్ రవికుమార్ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో వున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మించనున్నారని... రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో వున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు షికారు చేస్తున్నాయి. నందమూరి-మెగా హీరోల కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీపై అప్పుడే అభిమానుల్లో అంచనాలు సహజంగానే రెట్టింపవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:శ్రీమంతుడికి వన్ ఇయర్ సంబరం!

ఇవి కూడా చదవండి:అల్లు శిరీష్ ని బేవర్స్ ఎదవా అనేసింది

English summary

Nandamuri Family Star Hero Kalyan Ram and Mega Hero Sai Dharam Tej was together to act in a Multi SDtarrer film and this movie was going to be directed by Pilla Nuvvu Leni Jeevitam movie fame Ravi Kumar.