'ఇజం' కోసం కళ్యాణ్ రామ్ ఎంత శ్రమపడ్డాడో చూడండి(వీడియో)

Kalyan Ram hard workout for Ism movie

11:53 AM ON 18th October, 2016 By Mirchi Vilas

Kalyan Ram hard workout for Ism movie

అతడు నందమూరి ఇంటి నుంచి వచ్చిన హీరో.. జయాపజయాలతో సంబంధం లేకుండా చిత్రాలను చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో కల్యాణ్ రామ్. అంతేకాదు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సినిమాలు నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక కథానాయకులను పక్కా మాస్ గా చూపించడంలో పూరి జగన్నాథ్ స్టైల్ వేరు. 'ఇడియట్' నుంచి 'లోఫర్' వరకు ఆయన సినిమాల్లో హీరోలు రఫ్ అండ్ టఫ్ గా ఉంటారు. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం 'ఇజం'. గత చిత్రాలకు భిన్నంగా కల్యాణ్ రామ్ ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. ఈనెల 21 ఇజం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల ఓ సందర్భంలో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో సిక్స్ ప్యాక్ చేసిన చివరి హీరో తానే అవుతానేమో అని నవ్వేసాడు. సిక్స్ ప్యాక్ కోసం మూడు నెలల పాటు కష్టపడి, దాదాపు పది కిలోలు తగ్గాడు. మరి కల్యాణ్ రామ్ లోని ఇజం చూపించడానికి ఏ విధంగా సిక్స్ ప్యాక్ తో తయారయ్యారో తెలుపుతూ దర్శకుడు పూరి ఓ వీడియో అభిమానులతో పంచుకున్నాడు. దీనిపై మీరు ఓ లుక్కెయ్యండి.

English summary

Kalyan Ram hard workout for Ism movie