అప్పుల్లో 'ఇజం' హీరో కల్యాణ్ రామ్?!

Kalyan Ram in Debts

12:09 PM ON 22nd October, 2016 By Mirchi Vilas

Kalyan Ram in Debts

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో 'ఇజం' సినిమా విడుదలైంది కదా... ప్రస్తుతం విడుదలైన ఇజం సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ నే అందుకుందని అంటున్నారు. అసలు ఈ సినిమా షూటింగ్ పూర్తైన నాటినుంచి ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. సినిమాకు సంబంధించి ప్రి-రిలీజ్ బిజినెస్ సరిగ్గా జరగలేదని, నష్టానికే కల్యాణ్ రామ్ సినిమా హక్కులను అమ్మాడన్న వార్తలు గుప్పుమన్నాయి. రూ.25 కోట్లు సినిమాకైతే కేవలం 20 కోట్లే వచ్చాయని, 'ఓం 3డీ' అట్టర్ ఫ్లాప్ తర్వాత ఇజంతో కల్యాణ్ రామ్ అప్పుల్లో మునిగిపోయాడని సినీ వర్గాలు చర్చించుకున్నాయి. అయితే.. వాటన్నింటికీ కల్యాణ్ రామ్ సమాధానం చెప్పాడు. సినిమా ప్రమోషన్లలో భాగంగా తన ఆర్థిక స్థితిగతులపై కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చాడు.

'ఇజం' సినిమా కోసం మరీ అంత భారీ బడ్జెట్ ను ఏం కేటాయించలేదని, అనుకున్న దాని కన్నా కొంచెం అటూ, ఇటూగా ఖర్చైందని వివరించాడు. తానెలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవట్లేదని స్పష్టం చేశాడు. ఒకవేళ తాను ఆర్థికంగా తాను అంతగా దిగజారిపోతే సినిమాలను ఎలా తీయగలనని ప్రశ్నించాడు. కాగా, వేరే నిర్మాణ సంస్థల సారథ్యంలో ఎందుకు సినిమాలు తీయట్లేదన్న ప్రశ్నకు.. వేరే బ్యానర్లలో నటించాలని తనకూ ఉందని, అయితే దర్శకులు వచ్చి కథలు చెప్పడం అవి నచ్చేయడంతో కొన్ని.. కొన్నిసార్లు తన బ్యానర్లోనే సినిమాలు చేసేందుకు టెంప్ట్ అవుతుంటానని వెల్లడించాడు. ఆ రిస్క్ ను తానే తీసుకుంటానని చెప్పాడు. ఇక నుంచి బయటి బ్యానర్ల సినిమాల్లోనూ నటించడంపై దృష్టి సారిస్తానని కల్యాణ్ రామ్ వెల్లడించాడు.

English summary

Kalyan Ram in Debts