కొత్త లుక్ తో షాక్ ఇస్తున్న కళ్యాణ్ రామ్

Kalyan Ram New Shocking Look In Puri Jagannadh Film

01:45 PM ON 1st June, 2016 By Mirchi Vilas

Kalyan Ram New Shocking Look In Puri Jagannadh Film

తొలి సినిమానుంచీ ఏ సినిమాలో చేసినా పెద్దగా గెటప్ ఛేంజ్ లేకుండా ఒకేలా ఉంటూ వస్తున్న కళ్యాణ్ రామ్ చేత రికార్డు బ్రేక్, అదే గెటప్ చేంజ్ చేయిస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్.... పూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ లో కనబడనున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమా పూరీ స్టైల్లో ఓ కమర్షియల్ సినిమాగా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మిస్ ఇండియా 2015..అదితి ఆర్య ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె ఓకే చేస్తే ఇదే టాలీవుడ్ లో ఆమె తొలి చిత్రం. ఆమెను కలిసి ఇప్పటికే టీమ్ కథ ని వినిపించిందని తెలుస్తోంది. స్టోరీలైన్ నచ్చిన అదితి, ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోవటానికి చాలా ఎక్సైట్మెంట్ తో ఎదురుచూస్తున్నట్లు చెప్పిందని యూనిట్ వర్గాలు చెప్తున్నారు.

ఇక ఈ సినిమాట్ కళ్యాణ్ రామ్ ను పూరీ జగన్నాథ్ స్టైలిష్ లుక్ లో చూపించబోతున్నాడు. ఎవరిని చంపడానికి వస్తున్నాడంటూ కామెంట్ రాసి ఈ ఫొటోను పూరీ జగన్నాథ్ ట్విట్టర్లో పోస్టు చేశాడు. హెయిర్ స్టైల్, గడ్డం.. విషయంలో మార్పు తీసుకువచ్చి.. ఇలా కళ్యాణ్ రామ్ లుక్ ను పూర్తిగా మార్చేశారు పూరీ. ఇక ఈ ఫోటోను పూరీ విడుదల చేసిన కొద్దిసేపటికే అన్ని వర్గాల నుంచీ మాంచి రెస్పాన్స్ వస్తోంది.

English summary

At Present Nandamuri Kalyan Ram was signed a movie with Director Puri Jagannadh and recently Puri Jagannadh was released the new look of Kalyan Ram from his movie. In that look Kalyan Ram Looks Quite Handsome and Miss India 2015 Athidi Arya was acting as heroine in the movie.