ఆ సినిమాలు హిట్ కాకుంటే సంచలన ప్రకటన చేస్తాడట

kalyan Ram Sensational Comments

11:02 AM ON 18th August, 2016 By Mirchi Vilas

kalyan Ram Sensational Comments

కళ్యాణ్ రామ్ మంచి స్పీడుమీదున్నాడు. ఇప్పటి వరకూ ఒక సినిమా రిలీజ్ అయిన తరువాత గ్యాప్ తీసుకుని మరో సినిమా చేసిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు పూరి జగన్నాథ్ తో చేస్తున్న ‘ఇజం’ సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి ఎ.ఎస్.రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో మల్టీస్టారర్ మూవీ కాగా, ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే జి.నాగేశ్వరరెడ్డి డైరెక్టర్ గా ఓ సినిమా కమిటయ్యాడట.

ఈ సినిమా కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో ఇప్పటి వరకూ టచ్ చెయ్యని రొమాంటిక్ కామెడీ జానర్ తో రాబోతోంది.అప్పట్లో బాబాయ్ బాలక్రిష్ణ ఇదే రొమాంటిక్ కామెడీ జానర్ లో చేసిన నారి నారి నడుమ మురారి సూపర్ హిట్ అయ్యింది. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి బాలయ్య సూపర్ హిట్ మూవీ ‘మంగమ్మగారి మనవడు’లోని ఫేమస్ సాంగ్ ‘దంచవే మేనత్త కూతురా’ టైటిల్ గా ఫిక్సయ్యారట.

కామెడీ మీద పట్టున్న నాగేశ్వరరెడ్డితో కళ్యాణ్ రామ్ చేయబోయే ఈ మూవీతో కళ్యాణ్ రామ్ హిట్ కొడతాడో లేదో వేచి చూడాలి. ఇదిలాఉంటే, ఇంతవరకూ కళ్యాణ్ రామ్ చాలా సినిమాలు చేసినప్పటికీ బ్లాక్ బస్టర్ మూవీల జాబితాలో అతని సినిమాలు చోటు సంపాదించలేకపోయాయి. దీంతో తర్వాత చేయబోయే మూడు ప్రాజెక్ట్ లలో ఏదోక సినిమా బ్లాక్ బస్టర్ కావాలని లేకపోతే, తన ఓ సంచలన ప్రకటన చేస్తానని కళ్యాణ్ సన్నిహితుల దగ్గర అన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. అయితే, కళ్యాణ్ రామ్ చేయబోయే ఆ ప్రకటన ఎలా ఉంటుంది అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఒక వేళ సినిమాల్లోంచి తప్పుకుంటాడా అని ఓ వైపు కామెంట్స్ పడిపోతుంటే, మరోపక్క కొంపదీసి పాలిటిక్స్ లోకి కళ్యాణ్ రామ్ వెళ్తాడా ఏమిటి అంటూ సరదా కామెంట్స్ కూడా పడుతున్నాయి. ఇంతకీ సంచలన ప్రకటన ఏమిటబ్బా!

ఇది కూడా చూడండి: మీ రాశి ప్రకారం ఎ కెరీర్ లో బాగా రాణిస్తారు

ఇది కూడా చూడండి: శ్రీహరి మృతికి అసలు కారణం చెప్పిన భార్య

ఇది కూడా చూడండి: మిమ్మల్ని పోలిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఉందా

English summary

kalyan Ram Sensational Comments.