నాన్నకు ప్రేమతో.. కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ లుక్

Kalyan Ram six pack look from ISM movie

04:12 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Kalyan Ram six pack look from ISM movie

మిగిలిన దర్శకుల మాటేమో గానీ, తన సినిమాల హీరోలంటే చాలు.. దర్శకుడు పూరీ జగన్నాధ్ ఒక ఆయుధం దొరికినట్లు ఫీలవుతాడు. వెంటనే వారిని చాకుల్లా మార్చేసి ఆడియన్స్ మీదకు వదులుతాడు. అసలు ఎప్పుడైతే నందమూరి కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తాడని ప్రకటించాడో అప్పుడే మనోడు ఈ నందమూరి హీరోను భారీగా మర్చేస్తాడని అనుకున్నారు జనాలు. అనుకున్నంత పనీ చేశాడు ఇప్పుడు. 'ఇజం' సినిమా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశాడు పూరీ. ఈరోజు నందమూరి హరికృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు బర్తడే విషెస్ చెబుతూ.. ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అయితే ఈ పోస్టర్లో ట్విస్టేంటంటే.. తొలిసారిగా తన సిక్స్ ప్యాక్ లుక్ ను చూపించాడు కళ్యాణ్ రామ్. ఇప్పటికే ఆల్రెడీ సిక్స్ ప్యాక్ చేస్తున్నట్లు ప్రకటించేశాడు కానీ.. ఇదే మనోడు తొలిసారిగా చూపించడం. పూరి డైరక్షన్లో రూపొందిన ఈ 'ఇజం' సినిమా సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ అవుతుందని టాక్ వస్తోంది. ఇప్పటికే హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రిలీజై, తండ్రికి హ్యాపీనెస్ తెస్తే, ఇజం లుక్ తో కళ్యాణ్ రామ్ సంతోషం నింపాడని అంటున్నారు.

ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు...

ఇది కూడా చదవండి: కాబోయే భార్యను అవమానించినందుకు యువరాజ్ భలే బుద్ధి చెప్పాడు!

ఇది కూడా చదవండి: సంగీత ప్రియులు మనసు దోచే విభిన్న సంగీత వాయిద్యాలు!

English summary

Kalyan Ram six pack look from ISM movie. Nandamuri Kalyan Ram - Puri Jagannadh combo ISM movie look.