తెలుగు తెర పై మరో నందమూరి వారసుడు

Kalyan Ram Son To Give Entry In Tollywood

01:19 PM ON 12th May, 2016 By Mirchi Vilas

Kalyan Ram Son To Give Entry In Tollywood

తెలుగు చలన చిత్ర సీమకు గాడ్ ఫాదర్ ఎవరని అంటే టక్కున చెప్పే పేరు స్వర్గీయ ఎన్టీఆర్ . తెలుగు తెర ఫై నందమూరి తారక రామారావు స్థాయి ఏంటో ఇప్పటికి ఎవరు మరచిపోలేరు , ఎంత మంది ఇండస్ట్రీ కి వచ్చినా కూడా మరెవరు కూడా ఎన్టీఆర్ స్థాయిని అందుకోలేకపోయారు . నందమూరి ఫ్యామిలి నుండి వచ్చిన బాలకృష్ణ , హరి కృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ , తారక రత్న వంటి హీరోలు ఎన్టీఆర్ వారసులుగా తెలుగు వెండి తెర పై ఆయన పేరు ను నిలబెట్టారు.

ఇవి కూడా చదవండి:కోహ్లితో డేటింగ్ కి రెడీ అంటున్నబాలీవుడ్ భామ( వీడియో)

ఇక అసలు విషయానికి వస్తే తాజాగా నందమూరి ఫ్యామిలి నుండి మరో నట వారసుడు రాబోతున్నాడు . అతడు మరెవరో కాదు నందమూరి కళ్యాణ్ రామ్ కుమారుడు శౌర్య . కళ్యాణ్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి మొదలుకానుంది , అయితే ఈ సినిమాలో ఓ చిన్న పిల్లవాడి పాత్ర కోసం కళ్యాణ్ రామ్ కొడుకు శౌర్య నటిస్తే బాగుంటుందని పూరీ, కళ్యాణ్ రామ్ కు చెప్పాడట. తన కొడుకు ఎంట్రీకి కళ్యాణ్ రామ్ ఓకే చెప్పడంతో నందమూరి కుటుంభం నుండి మరో వారసుడు రాబోతున్నాడు.

ఇవి కూడా చదవండి:సిక్స్ ప్యాక్ తో అదరగొడుతున్న హీరోయిన్

ఇవి కూడా చదవండి:రఘుబాబు ఇంట్లో విషాదం!

English summary

Another Actor from Nandamuri family was going to give entry into Tollywood. Nandamuri Kalyan Ram's Son Sourya Ram was going to make debut in Kalyan Ram's movie with Director Puri Jagannadh.