'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' సీక్వెల్‌ లో కళ్యాణ్‌రామ్‌

Kalyan Ram To Act In Cameraman Gangatho Rambabu Sequel

11:55 AM ON 2nd March, 2016 By Mirchi Vilas

Kalyan Ram To Act In Cameraman Gangatho Rambabu Sequel

స్పీడ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌కి లైఫ్‌ ఇచ్చిన హీరో పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'బద్రి' చిత్రం ఎంత సూపర్‌హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో దాదాపు 12 ఏళ్ల తరువాత వచ్చిన చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాబాంబు'. ఇందులో పవన్‌కళ్యాణ్‌ జర్నలిస్ట్‌గా నటించి రాజకీయంలో ఉన్న చెడుని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా కథ పరంగా బాగున్నా ఇందులో తమన్నా ఓవర్‌ యాక్షన్‌ ఎక్కువ అవ్వడంతో సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్‌ లో నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌ నటిస్తున్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వస్తే నందమూరి కళ్యాణ్‌రామ్‌ 'షేర్‌' సినిమా ఫ్లాప్‌ కావడంతో ప్రస్తుతం కథలు ఎంపిక చేసుకోవడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ ఆలోచనలోనే కళ్యాణ్‌రామ్‌ పూరీజగన్నాధ్‌ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో కళ్యాణ్‌రామ్‌ జర్నలిస్ట్‌గా నటించబోతున్నాడట. ఇప్పటి వరకు కళ్యాణ్‌రామ్‌ ఇటువంటి పాత్రలో నటించకపోవడంతో ఈ పాత్ర పై కళ్యాణ్‌రామ్‌ ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్‌ స్పయంగా నిర్మిస్తున్నారు. 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' లానే ఈ చిత్రం కూడా ఉంటుందని సమాచారం.

English summary

Nandamuri Kalyan Ram was going to act in the direction of Tollywood Top Director Puri Jagannadh.Recently a news came to know that from film industry Kalyan Ram to act in Cameraman Gangatho Rambabu Sequel.This film to be produced by Hero Kalyan Ram.