నవంబర్‌ 28న కళ్యాణ వైభోగమే ఆడియో

Kalyana Vybhogame Audio Release date November 28

03:42 PM ON 19th November, 2015 By Mirchi Vilas

Kalyana Vybhogame Audio Release date November 28

అలా మొదలైంది చిత్రంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న లేడీ దర్శకురాలు బి.వి. నందినిరెడ్డి. ఆ తరువాత సిద్ధార్ధ, సమంత జోడీగా జబర్ధస్త్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. అది ప్లాప్‌ అవ్వడంతో కొంత గ్యాప్‌ తీసుకుని నాగశౌర్య, మాళవిక నాయర్‌ హీరోహీరోయిన్లుగా 'కళ్యాణవైభోగమే' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవలే దీపావళి కానుకగా విడుదల చేశారు. నిండు కుటుంబంతో అందమైన పెళ్ళి వాతావరణంతో కనిపిస్తున్న ఆ పోస్టర్‌కి మంచి స్పందన వస్తుంది.

ఆ స్పందన చూసి దర్శకురాలు, చిత్ర యూనిట్‌ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. ఇక ఆడియోని, టీజర్‌ని ఈ నెల 28న లేదా 29న రిలీజ్‌ చెయ్యడానికి నందినిరెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటి రాశి కూడా నటించడం విశేషం. రంజిత్‌ మూవీస్‌ పతాకంపై దామోదర ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary

Kalyana Vybhogame Audio Release date November 28