త్రిషను చితకబాదిన కమల్‌!

Kamal beats trisha in fighting sequence of Cheekati Rajyam

06:24 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Kamal beats trisha in fighting sequence of Cheekati Rajyam

లోకనాయకుడు కమల్‌హాసన్‌ తన ప్రతి చిత్రం వైవిధ్యంగా ఉండటానికి ఇష్టపడతారు. క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే ఎంత అందవిహీనంగా కనిపించడానికైనా కమల్‌ వెనుకాడరు. కమల్‌ తన ప్రతి సినిమాని ఎంతో రియలిస్టిక్‌గా చూపించడానికి ఆరాటపడుతూ ఉంటారు. కమల్‌ తాజా చిత్రం 'చీకటిరాజ్యం' ఇందులో త్రిష ఒక ముఖ్య పాత్ర పోషించారు. మామూలుగా అయితే విలన్లు హీరోయిన్లను చితక్కొట్టడం, హీరోయిన్లు హీరోలని చితక్కొట్టడం వంటి సన్నివేశాలను మనం హాలీవుడ్‌లో మాత్రమే చూస్తాం. మన సినిమాల్లో హీరోయిన్లు చాలా అందంగా ఫుల్‌ ఎక్స్‌పోజింగ్‌లో కనబడితేనే ఇష్టపడతాం. ఐతే చీకటిరాజ్యంలో మాత్రం కమల్‌ త్రిషను చితకబాదాడు.

చీకటిరాజ్యంలో త్రిష ఒక ముఖ్యమైన పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇందులో కమల్‌-త్రిషలు మధ్య వచ్చే కిచెన్‌ ఫైటింగ్‌ సన్నివేశం ప్రేక్షకులని మెస్మరైజ్‌ చేసింది. త్రిష కరాటే చేస్తూ కాళ్లతో కమల్‌ని పెనవేసి కింద పడేసే సీన్‌లో త్రిష అదరగొట్టేసిందనే చెప్పాలి. ఇద్దరి మధ్య జరిగే పెనుగులాటని చాలా రియలిస్టిక్‌గా తీశారు. త్రిష నుంచి విడిపించుకున్నాక కమల్‌ త్రిషని జాలీ, కనికరం లేకుండా చితక్కొట్టేశాడు. గోడలకేసి కొట్టడం, గాల్లో ఎగరేసి కింద పడేయడం, ఇలా త్రిషను ఓ రేంజ్లో చితకబాదాడు. సినిమాల్లో ఈ ఫైటింగ్‌ సీక్వెన్స్‌ ఒక హైలెట్‌ అనే చెప్పాలి.

English summary

Kamal beats trisha in fighting sequence of Cheekati Rajyam