16 ఏళ్ళ నాటి అనుబంధం

Kamal Haasan's Hey Ram Movie Completed 16 Years

10:07 AM ON 20th February, 2016 By Mirchi Vilas

Kamal Haasan's Hey Ram Movie Completed 16 Years

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ నటించి, దర్శకత్వం వహించిన ‘హే రామ్‌’ చిత్రం గతంలో వచ్చింది.షారుఖ్‌ ఖాన్‌, హేమా మాలిని, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఈ చిత్రంవిడుదలై 16 సంవత్సరాలైన సందర్భంగా కమల్‌ హాసన్‌ ఈ చిత్రం కోసం పని చేసిన వారితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈమేరకు కమల్‌ హాసన్‌ ట్వీట్‌ చేసాడు. ఈ సినిమాలో మోహన్‌ గోఖలే అనే నటుడు ఓ కీలక పాత్రలో నటించాడు. అయితే దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తయిన తరువాత అనుకోకుండా గోఖలే మృతి చెందడంతో. ఆ స్థానంలో అతుల్‌ కులకర్ణి నటించాడు.ఈ పాత్రకు అతుల్‌ కులకర్ణికు జాతీయ స్థాయిలో పురస్కారం కూడా లభించింది. మోహన్‌ గోఖలేతో తన అనుబంధాన్ని కమల్ గుర్తు చేసుకుంటూ గోఖలే నటించిన భాగం వీడియోని అభిమానుల కోసం త్వరలో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని పేర్కొన్నాడు.

English summary

Kamal Haasan's "Hey Ram" movie which is considered to be the magnum opus of was released on February 16, in 2000. It has been 16 years since the film was released but it still lingers in the memory of many Kamal fans.This movie was directed by Kama Hassan.Kamal Hassan posted a post in his twitter and remembered this movie.