వాళ్లపై కమల్ హాసన్ ఆగ్రహం

Kamal Hasan was very angry on them

11:20 AM ON 24th January, 2017 By Mirchi Vilas

Kamal Hasan was very angry  on them

జల్లికట్టు వివాదం ఇంకా నలుగుతోంది. ఓ పక్క ఆర్డినెన్స్ వచ్చినా మరోపక్క వివాదం రగులుతోంది. ముఖ్యంగా జంతు హక్కుల సంస్థ పెటా తీరుని సినీ నటులు ఎండగడుతున్నారు. ఇప్పటికే తమిళ సినీ నటులు సూర్య, విజయ్ ఈవిషయంలో ఆగ్రహం వ్యక్తం చేయగా, అదే బాటలోనే ప్రముఖ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా మండిపడ్డారు. తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జంతు హక్కుల సంస్థ పెటా తీరుపై మండిపడ్డారు. భారతీయ ఎద్దులను అణచివేసే అర్హత పెటాకు లేదని విమర్శించారు.

కావాలంటే డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికాలో నిర్వహించే బుల్ రైడింగ్ రోడియోస్ ను నిషేధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈమేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ఎట్టకేలకు ప్రజలకు ప్రజాస్వామ్యమంటే ఏమిటో తెలుస్తున్నదని, నాయకుల రోజులు పోయాయని ఆయన పేర్కొన్నారు. వినయంతో కూడిన మార్గఅన్వేషకులు, సామాజిక సంస్కరణవేత్తలు మనకు కావాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు తమిళనాడు అంతటా జల్లికట్టు ఉద్యమం ఉధృతరూపు దాల్చిన సంగతి తెలిసిందే. మెరీనా బీచ్ లోని ఆందోళన చేస్తున్న యువతను బలవంతంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తమిళనాడు అంతటా నిరసనలు ఎగిసి పడుతున్నాయి. ఎక్కడికక్కడ ఆందోళనకారులు పోలీసులపై తిరగబడుతున్నారు. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇది కూడా చూడండి : మైక్రోసాఫ్ట్ నిర్ణయంతో కోట్లాదిమందిలో ఆందోళన

ఇది కూడా చూడండి : బైక్ ను ఉదయాన్నే సెల్ఫ్ తో కాకుండా కిక్ తో స్టార్ట్ చేయాలి, కారణం ఇదే

English summary

Still discussion on Jallikattu was going on in Tamilnadu, Film Actors Surya and Kamal Hasan was very angry with people those who were opposing with this Jallikattu. They responded in twitter about this issue.