సెన్సార్‌ బోర్డు నా సృజనాత్మక స్వేచ్ఛను అడ్డుకుంటోంది

Kamal Hassan About Censor Board

10:22 AM ON 9th February, 2016 By Mirchi Vilas

Kamal Hassan About Censor Board

‘విశ్వరూపం’ విడుదల సమయంలో కమల్‌ సెన్సార్‌ నిబంధనల విధానం సరికాదంటూ గళం విప్పిన ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ ఇంకా సెన్సార్ ఇబ్బందులను మరిపోలేకపోతున్నాడు. తాజాగా బోస్టన్‌లో రెండు రోజులపాటు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన యాన్యువల్‌ ఇండియా కాన్ఫరెన్స్‌ - 2016లో పాల్గొన్న కమల్‌ మరోసారి సెన్సార్ గురించి ప్రస్తావించాడు. అయితే ప్రస్తుతం భారతీయ సెన్సార్‌ బోర్డు సంస్కరణ బృందంలో సభ్యుడిగా ఉన్న కమల్‌ భారతీయ సినిమా సెన్సార్‌ విధానం తదితర అంశాల గురించి మాట్లాడాడు. ‘ ఐటీ పరిశ్రమ స్థాయిలో వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని అందిస్తాం . అయితే సినిమా పరిశ్రమకు గౌరవమిచ్చి, అన్ని వ్యాపారాల్లాగే సినిమా పరిశ్రమనూ గుర్తించండి' అంటూ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘ చట్టబద్ధమైన హెచ్చరికలా సెన్సార్‌ ధ్రువీకరణ ఉండాలి. సెన్సార్‌ బోర్డులోని వ్యక్తులు ఉద్యోగులు మాత్రమే. వాళ్లకిచ్చిన నిబంధనలు అమలు చేస్తున్నారు. నా ప్రశ్న అంతా నిబంధనల విషయంలోనే. సెన్సార్‌ బోర్డు నా సృజనాత్మక స్వేచ్ఛను అడ్డుకుంటోంది. అలా వుండకూడదు' అని కమల్‌ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ‘‘ప్రస్తుతం ముగ్గురు అమెరికన్‌ స్నేహితులతో కలసి ఓ కథ సిద్ధం చేస్తున్నా. ఆంగ్లంలో తెరకెక్కబోయే ఆ చిత్రానికి నేనే దర్శకత్వం వహించే అవకాశం ఉంద’’ని చెప్పారు.

ఆంక్షలు పెరుగుతున్నాయి: ఇక ఇదే కార్యక్రమంలో బాలీవుడ్‌ యువ కథానాయకుడు ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా మాట్లాడుతూ ‘‘సినిమాల సెన్సార్‌ అంటే భారతదేశంలో భయపడే పరిస్థితి నెలకొంది. ప్రపంచం మొత్తం పురోగమనంలో సెన్సార్‌ విధానం తిరోగమనంలో వుంది’’ అన్నాడు.

English summary