కావేరిపై కమల్ కామెంట్

Kamal Hassan comments on Kaveri lake

02:28 PM ON 15th September, 2016 By Mirchi Vilas

Kamal Hassan comments on Kaveri lake

కావేరీ నదీ జలాల కోసం తమిళనాడు-కర్ణాటకల మధ్య రేగిన ఘర్షణ పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పరిష్కార దిశగా చాలామంది రంగంలో దిగారు. ఇక సీనియర్ నటుడు కమల్ హాసన్ స్పందిస్తూ, నదీ జలాల కోసం ఘర్షణ పడడం సిగ్గుచేటైన విషయంగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ, మనం భాష తెలియని వానరాలుగా ఉన్నప్పుడూ కావేరీ ప్రవహించింది. మానవుడిగా మారి నాగరికత నేర్చుకున్న తరువాత ప్రవహిస్తూనే ఉంది. మనతరం ముగిసిన తరువాత అది అలానే ప్రవహిస్తుంది. జరిగిన చరిత్రను ఆ నది చెబుతుంటే మనం మాత్రం ఘర్షణలకు పాల్పడడం సిగ్గుచేటు అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

కాగా, కావేరీ జలాల చిచ్చుతో తమిళనాట రేగిన ఆందోళనలు బుధవారం సద్దుమణిగాయి. మరోవైపు తమిళనాడు రైతు సంఘాల సమాఖ్య, వ్యాపార సంఘాల సమాఖ్య శుక్రవారం బంద్ కు పిలుపునివ్వగా, పుదుచ్చేరిలో అదేరోజు బంద్ కు మక్కల్ ఉరిమై పార్టీ పిలుపు ఇచ్చింది. మొత్తానికి ఈ వివాదం అందరినీ కదిలించింది. సోషల్ మీడియాలో కూడా బోల్డన్ని కధనాలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: సృష్టిలో తొలి భార్యాభర్తలు ... మనకు తెలీని రహస్యాలు

ఇది కూడా చదవండి: బట్టలు బాలేదని లోపలకి రానివ్వకుండా ఆపేసిన ఫేమస్ రెస్టారంట్!

ఇది కూడా చదవండి: వండిన ఆహారాన్ని 48 నిముషాల్లోపే తినేయాలి.. ఎందుకంటే?

English summary

Kamal Hassan comments on Kaveri lake. The fight between Karnataka and Tamil Nadu about Kaveri lake Universal Hero Kamal Hassan responds on it.