కమల్‌ సినిమా ఆగిపోయింది!

Kamal Hassan movie was stopped

04:01 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Kamal Hassan movie was stopped

లోకనాయకుడు కమల్‌హాసన్‌ గత ఏడాది ఉత్తమ విలన్‌, చీకటిరాజ్యం చిత్రాలతో అందరినీ అలరించాడు. ఈ చిత్రాలు విజయం సాధించడంతో కమల్‌ కి ఒక కొత్త ఎనర్జీ వచ్చింది. అందుకే వరుస పెట్టి సినిమాలు చెయ్యడానికి సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలోనే కమల్‌ మలయాళ డైరెక్టర్‌ టి.కె. రాజీవ్‌ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి అంగీకరించాడు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగులో ఒకేసారి తెరకెక్కించాలని భావించారు. తమిళంలో 'అప్ప అమ్మ వేలయట్టు' తెలుగులో 'అమ్మ నాన్న ఆట' అనే టైటిల్స్‌ ని కూడా అనౌన్స్‌ చేశారు. కమల్‌ సరసన అమల అక్కినేని, జరీన వాహీబ్‌లను కూడా ఎంపిక చేశారు.

అయితే ఇంత వరకు ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లలేదు. ఇప్పుడు ఈ చిత్రం పూర్తిగా ఆగిపోయింది. కారణాలు తెలీదు గానీ ఈ చిత్రం ఉండబోదని తెలియజేశారు. దీనితో కమల్‌ తన తరువాత చిత్రం పై దృష్టి పెట్టారు. ఈ చిత్రానికి కూడా టి.కె. రాజీవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

English summary

Kamal Hassan latest movie was Amma Nanna Aata was stopped due to some reasons. In this movie Amala Akkineni was seletced as a heroine. This movie want to direct by T.K. Rajeev.