పిల్లలతో కమల్ - గౌతమిల కొత్త కళ

Kamal Hassan Named Two Children

04:28 PM ON 13th April, 2016 By Mirchi Vilas

Kamal Hassan Named Two Children

ప్రముఖ కథానాయకుడు, సకల కళావల్లభుడు కమల్‌హాసన్. విభిన్న పాత్రలకు పెట్టింది పేరు ... అందుకే చకచకా పేర్లు పెట్టేయడంలోనూ దిట్టే. హోషికా మృణాళిని, శ్యమంతకమణి అశ్విక..ఈ పేర్లు వినడానికే కొత్తగా, సృజనాత్మకంగా ఉన్నాయి కదూ! ఇటీవల కాలంలో ఇద్దరు సినీ జంటలకు పుట్టిన ముద్దుల పాపాయిలకు కమల్ పెట్టిన పేర్లివి. కమల్‌ కేవలం సినిమాలకే తన సృజనాత్మకతను పరిమితం చేయకుండా పిల్లలకు పేర్లు పెట్టడంలోనూ తనలోని మరో కళని బయటపెడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం ‘తూంగావనం’ దర్శకుడు రాజేష్‌ ఎం.సెల్వ కుమార్తెకి హోషికా మృణాళిని అనే పేరు పెట్టిన కమల్‌, తాజాగా నృత్యదర్శకుడు శోభి కూతురుకి శ్యమంతకమణి అశ్విక అనే పేరుని పెట్టారు. శోభి దంపతులను వారి ఇంటికి వెళ్లి అభినందించడమే కాకుండా వారితో కాసేపు సరదాగా గడిపారాయన. గౌతమి కూడా ఈ నామకరణోత్సవ వేడుకలో పాలుపంచుకున్నారు.

English summary

Hero Kamal Hassan and his wife Gowtami attended to a event and named the children. Previously Kamal Hassan Named Hoshika Mrunalini, Syamanthakamani Ashwika.