మళ్లీ కలిసినటించబోతున్న కమల్‌,శ్రీదేవి,అమల!!

Kamal Hassan romancing with Sridevi and Amala

06:56 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Kamal Hassan romancing with Sridevi and Amala

లోకనాయకుడు కమల్‌హాసన్‌ అతిలోక సుందరి శ్రీదేవి కలిసి అప్పట్లో ఎర్రగులాబీలు, వసంత కోకిల, ఆకలి రాజ్యం వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించారు. మళ్లీ వీరిద్దరూ కలిసి వెండితెరని పంచుకోబోతున్నారు. చీకటి రాజ్యం సక్సెస్‌తో మంచి ఉత్సాహం మీదున్న కమల్‌ తాజాగా ఒక చిత్రానికి శ్రీకారం చుట్టారు. అదే 'అప్పాఅమ్మా విళయాట్టు' తెలుగులో 'నాన్న అమ్మ ఆట' అనే పేరుతో రాబోతుంది. టి.కె. రాజీవ్‌ కుమార్‌ డైరెక్షన్‌లో తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో కమల్‌ సరసన జరీనా వహాబ్‌, అక్కినేని అమల కూడా నటించబోతున్నారు.

English summary

Kamal Hassan romancing with Sridevi and Amala in Nanna Amma Aata and directing by T.K. Rajeev