షారుఖ్ పై కమల్ షాకింగ్ కామెంట్స్!

Kamal Hassan shocking comments on Sharukh Khan

11:48 AM ON 13th August, 2016 By Mirchi Vilas

Kamal Hassan shocking comments on Sharukh Khan

ఈమధ్య బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ కు అమెరికాలో ఎదురైన అవమానం జరగడం, అక్కడి అధికారులు షారూక్ కు క్షమాపణలు చెప్పడం నేపథ్యంలో జోరుగానే చర్చ సాగుతోంది. ఓపక్క షారూక్ కు అవమానం జరిగిన తీరుపై భారతదేశం తీవ్రంగా ఆలోచిస్తుంటే.. అమెరికా విమానాశ్రయ అధికారులు షారూక్ ను ఆపడంలో తప్పేమీ లేదంటూ, మరోపక్క అగ్రనటుడు కమల్ హాసన్ డిఫరెంట్ గా స్పందించాడు. ఇది చాలా సాధారణ విషయమని, అభిమానులు ఎందుకు ఆవేశపడుతున్నారో అర్థం కావడం లేదన్నాడు. అమెరికా అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించారని, కొందరు ప్రత్యేక వ్యక్తుల కోసం అధికారులు తమ నిబంధనలు సడలించలేరని కమల్ సమర్ధించుకొచ్చాడు. మనం దీనిపై అతిగా స్పందిస్తున్నాం. అంత అవసరం లేదు.

ఈ ఖాన్.. షారూఖ్ ఖాన్ అవడం వల్లే మనం ఇలా స్పందిస్తున్నాం. అయితే, షారూక్ మాత్రం మనలా ఆలోచించి ఉండడు. నేను షారూక్ ని.. నన్ను ప్రత్యేక గౌరవం దక్కాలి అని అతను ఎప్పుడూ చెప్పలేదు అని కమల్ అన్నాడు. ఈ ఘటన షారూక్ అభిమానులను గాయపరిచి ఉండొచ్చని, కానీ, అమెరికా దేశమే గాయపడిందని, అందుకే అది అంత జాగ్రత్తగా ఉంటోందని కమల్ అన్నాడు. ఇటువంటి అనుభవం నాకు కూడా ఎదురైంది. నేను కూడా విమానం మిస్ అయ్యా. నాకు ఎవరూ క్షమాపణలు చెప్పలేదు. వాళ్ల పని వాళ్లు చేస్తున్నారంతే అని కమల్ చెప్పడం ఆలోచన రేకెత్తించింది. అయితే, అమెరికా రక్షణ విభాగ అధికారులు ఖాన్ల పట్ల దయగా ఉండాలని, ఖాన్ లందరినీ ఒకేగాటన కట్టకూడదని కూడా కమల్ అభిప్రాయంపడ్డాడు.

English summary

Kamal Hassan shocking comments on Sharukh Khan