సర్దార్ పై బెట్టింగ్.. ఆంధ్రా, తెలంగాణా లో నగ్నంగా పరిగెడతా

Kamal Khan sensational comments on Sardar Gabbar Singh

04:16 PM ON 6th April, 2016 By Mirchi Vilas

Kamal Khan sensational comments on Sardar Gabbar Singh

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు కమల్ ఖాన్ మరోసారి తన ట్విట్టర్ అకౌంట్ కు పని చెప్పారు. సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఏప్రిల్ 8వ తేదీన బాలీవుడ్ లో దాదాపు 800 ధియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదల సంధర్భంగా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ–కమల్ ఖాన్ ల మధ్య ట్విట్టర్ వేదికగా మంచి మాటల పోటీ జరిగింది. 'సర్దార్ గబ్బర్ సింగ్’ను పొగుడుతూ వర్మ చేసిన ఓ ట్వీట్ కు స్పందించిన కమల్ ఖాన్ మాటలు చివరికి వర్మ కు– కమల్ కు మధ్య బెట్టింగ్ కు కారణమయ్యాయి.

ఇది కూడా చదవండి: ఛ అవేం ప్రశ్నలు... అక్కడ వాటి సైజులు అడుగుతున్నారట

‘బాహుబలి’ మొదటి రోజున ప్రసాద్ ఐమాక్స్ ధియేటర్ వద్ద దాదాపు 1.5 కిలోమీటర్ల ‘క్యూ’ ఉంది, అయితే ఇప్పుడు 'సర్దార్ గబ్బర్ సింగ్’కు ఎంత లైన్ ఉంటుందో చూడాలి అంటూ వర్మ చేసిన ట్వీట్ కు ‘0 కిలోమీటర్లు’ అంటూ కమల్ ఖాన్ ట్వీట్ చేశాడు. పవన్ ను ఎవరితో పోల్చవద్దని, పవన్ కంటే హిందీలో కట్టప్ప పెద్ద స్టార్ అని, రాజ్ పాల్ యాదవ్ లాగా కనపడే పవన్ సినిమాకు ఉచిత టికెట్ + రవాణా చార్జీలు + కూల్ డ్రింక్ + పాప్ కార్న్ ఇచ్చినా గానీ హిందీ ప్రేక్షకులు పవన్ సినిమాకు వెళ్ళరని కమల్ ఖాన్ ట్వీట్ చేశాడు. ప్రపంచంలోనే పవన్ కళ్యాణ్ అత్యంత క్రేజీ నటుడు, ఇది కమల్ ఖాన్ అర్ధం చేసుకోవాలని వర్మ చేసిన ట్వీట్ కు... హిందీలో పవన్ కంటే ఆయుష్మాన్ పెద్ద స్టార్ అని కౌంటర్ ఇచ్చాడు.

ఇది కూడా చదవండి: 'సర్దార్' టికెట్ తో సమ్మర్ డ్రింక్ ఫ్రీ

“10 మంది కంటే ఎక్కువ ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ సినిమాకు వచ్చారని తెలిస్తే, నేను రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో 'నగ్నంగా' పరిగెడతానని” కమల్ చేసిన ట్వీట్ కు ‘అయితే సిద్ధంగా ఉండు, పవన్ గురించి నీకేమి తెలీదు 'బాంబే వెల్వెట్' సినిమా విషయంలో నీ అభిప్రాయం సరై ఉండవచ్చు, కానీ 'సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలో మాత్రం నీది తప్పు అవుతుంది అంటూ వర్మ కౌంటర్ ఇచ్చారు. పవన్ అభిమానుల సంగతి పక్కన పెట్టు, ఒక్కసారి పవన్ ను ముంబై వచ్చి నా గురించి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడమను.. అప్పుడు ఏం జరుగుతుందో చూసుకుందాం. ఇది నా అడ్డా బాస్…

ఇది కూడా చదవండి: శ్రీ దుర్ముఖిలో మీ రాశి ఫలాలు తెలుసుకోండి

అసలు పవన్ కళ్యాణ్ అనే పేరు బాలీవుడ్ లో ప్రచారం అయ్యింది అంటే అది నా ట్వీట్స్ వలనే, లేకపోతే అసలు పవన్ అనే పేరే ఎక్కడా వినపడేది కాదని, దేశంలోనే నెంబర్ 1 విమర్శకుడిగా పవన్ ను పాపులర్ చేసిన ఘనత నాకే దక్కుతుందని, లేదంటే దారుణమైన ఫ్లాప్ హీరో రాజ్ కుమార్ యాదవ్ కూడా పవన్ ను మించిన స్టార్ అయ్యే వాడని కమల్ ట్వీట్ చేశాడు.

English summary

Kamal Khan sensational comments on Sardar Gabbar Singh. Kamal Khan bets on Sardar Gabbar Singh hindi version.