మరో ఉద్యమం - కంబళపై కదం తొక్కిన కన్నడిగులు

Kambala Bull's controversy in Karnataka

03:11 PM ON 28th January, 2017 By Mirchi Vilas

Kambala Bull's controversy in Karnataka

మొత్తానికి దేనికి ఏది స్పూర్తో గాని ఉద్యమాలకు మాత్రం పలుచోట్ల రంగం సిద్ధం అవుతుంది. ఎందుకంటే తమిళనాట జల్లికట్టు ఉద్యమం రగిల్చిన స్ఫూర్తి పక్కరాష్ట్రాల్లో ఇంకా రగులుతూనే ఉంది. దున్నపోతుల క్రీడ ‘కంబళ’పై కొనసాగుతున్న నిషేధాన్ని తొలగించాలంటూ కర్నాటకలో యువత కదం తొక్కుతోంది. శుక్రవారం వేలాది మంది విద్యార్థులతో పాటు తుళు సినీ పరిశ్రమకు చెందిన నటులు, ప్రజాప్రతినిధులు రోడ్లపైకి వచ్చారు. స్థానిక ప్రజలు సంప్రదాయంగా భావించే కంబళ క్రీడకు మద్దతు తెలుపుతూ మంగళూరులో శుక్రవారం మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. జల్లికట్టుకు, కంబళ క్రీడకు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడంలో విఫలమైన ‘పెటా’పై వెంటనే నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఎంపీ నళిన్ కుమార్ కతీల్ మాట్లాడుతూ... ‘‘కంబళ అనేది తుళునాడులో (తమిళనాడు, కర్నాటక ప్రాంతాల్లో తుళు భాష మాట్లాడే ప్రజలు) సంప్రదాయంగా కొనసాగే క్రీడ.. జల్లికట్టుకు, కంబళకు మధ్య తేడా తెలియకుండా కంబళ క్రీడను నిషేధించాలంటూ పెటా పిటిషన్ వేసింది.

ఇక ఈ క్రీడలో దున్నపోతులకు ఎలాంటి హానీ జరగదు. కంబళపై నిషేధం ఎత్తివేసే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం’’ అని పేర్కొన్నారు. తమిళనాడులో మాదిరిగా కర్నాటక ప్రభుత్వం కూడా కంబళ క్రీడపై ఆర్డినెన్స్ తీసుకురావాలని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప డిమాండ్ చేశారు. కాగా కంబళ గ్రామీణులు ఇష్టంగా జరుపునే సంప్రదాయక క్రీడ అని... దీనికి తమ ప్రభుత్వం నుంచి తప్పకుండా సహకారం అందుతుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. న్యాయపరమైన అన్ని విషయాలు ఆలోచించి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావడానికి కూడా వెనుడామన్నారు. తమిళనాట జల్లికట్టు విషయంలో కేంద్రం అనుసరించిన సానుకూల వైఖరిని కంబళ విషయంలో కూడా కొనసాగించాలని అంటున్నారు. ఇంకెన్ని ఉద్యమాలు వస్తాయో చూడాలి.

ఇది కూడా చూడండి: 4 రోజుల్లో బరువు తగ్గడానికి సూపర్ చిట్కా

ఇది కూడా చూడండి: మీరు పుట్టిన నెలతో మీ మనస్తత్వం ఏంటో తెలుసుకోవచ్చు

English summary

Kambala is a traditional bulls festival in karnataka. people told to ban kambala game in karnataka as like Tamilnadu's jallikattu bulls game.