ఓ పుస్తకం మంత్రి పదవికే ఎసరు పెడుతోంది!

Kambampati Releases Book On Sujana Chowdary

11:35 AM ON 28th June, 2016 By Mirchi Vilas

Kambampati Releases Book On Sujana Chowdary

ఓ ఐడియా జీవితాన్నే మార్చేసిందని విన్నాం కానీ, ఓ పుస్తకం ఏకంగా ఓ కేంద్రమంత్రి పదవికే ఎర్త్ పెడుతోందట ఇప్పుడు. వివరాల్లోకి వెళ్తే, గత కొన్ని రోజులుగా కేంద్రమంత్రి సుజనా చౌదరికి వ్యతిరేకంగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక సుజనా చౌదరి అక్రమాలకు సంబంధించి ఆ మధ్య ఢిల్లీలో ఓ పుస్తకం హాట్ కేక్ లా సర్కులేట్ అయింది. స్పైరల్ బైండింగ్ చేసిన ఈ పుస్తకం దాదాపుగా 150 నుంచి 200 పేజీలు వుండే ఈ పుస్తకంలో సుజనా సంస్థకు సంబంధించి అనేక లోపాలు డాక్కుమెంట్లుసహా పొందుపరిచినట్లు చెబుతున్నారు.

అయితే, ఆ పుస్తకం ఎవరు మార్కెట్లోకి తీసుకొచ్చారన్న విషయం తెలీదు. కాని, దీనివెనుక కంభంపాటి రామమోహన్ ఉన్నారేమో అన్న అనుమానం సుజనాకి బలంగా ఉందని అంటున్నారు. కంభంపాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి రెన్యువల్ కాకపోవడానికి ఇది కూడా ఓ బలమైన కారణమానన్న ప్రచారమైతే గట్టిగా జరుగుతోంది. ఏ పుట్టలో ఏపామున్నదో ఎవరికి తెల్సు.

ఇవి కూడా చదవండి:మైసూర్ రాజా ఇంట పెళ్లి చూడతరమా!

ఇవి కూడా చదవండి:ఓ హత్య కేసులో 'రామచిలుక' సాక్ష్యం అట!

English summary

A book on Central Minister Sujana Chowdary was released and so many copies of the book were sold as hot cakes and according to a recent news that book was released by Kambampati Hari.