మళ్లీ 'కందిరీగ' డైరెక్టర్తో రామ్!

Kandireega Director Santhosh Srinivas again directing Ram

06:40 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Kandireega Director Santhosh Srinivas again directing Ram

నటనలోనూ, డ్యాన్స్లోనూ, ఫైట్స్లోనూ ఎనర్జీ చూపించే రామ్ ఈ మధ్య కథలు ఎంపికలో మాత్రం ఎనర్జీ చూపించలేకపోతున్నాడు. అందుకే వరుస పెట్టి ఫ్లాప్లు అందుకున్నాడు. వీటి నుండి కోలుకుని ఇప్పుడు ఆచి తూచి కథలు ఎంపిక చేసుకుంటున్నాడు రామ్. ఈ ఎనర్జెటిక్ హీరో తాజాగా నటించిన చిత్రం 'నేను-శైలజ'. ఈ చిత్రం పైనే రామ్ ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం తన సొంత బ్యానర్ అయిన స్రవంతి రవికిశోర్ నిర్మాణంలో, కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతుంది. 'నేను-శైలజ' చిత్రాన్ని న్యూఇయర్ కానుకగా జనవరి 1న విడుదల చేస్తున్నారు.

ఇదిలా ఉండగా రామ్ తన తరువాత చిత్రం కందిరీగ వంటి మంచి హిట్ అందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో కందిరీగ వంటి బ్లాక్బస్‌టర్ హిట్ కొట్టాలని రామ్ భావిస్తున్నాడట. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టేన్‌మెంట్స్ సంస్థ కానీ, స్రవంతి మూవీస్ సంస్థ కానీ నిర్మించే అవకాశాలు ఉన్నాయి.

English summary

Kandireega Director Santhosh Srinivas again directing Ram after completion of ram's Nenu-Sailaja.