ఆ పనులు చేసే దానిలా కనిపిస్తున్నానా?

Kangana Ranaut About Her Controversy With Adhyayan Suman

11:26 AM ON 16th May, 2016 By Mirchi Vilas

Kangana Ranaut About Her Controversy With Adhyayan Suman

అందమైన రూపం లేకున్నా, నలుగురినీ ఆకట్టుకునే భాషా చాతుర్యం లేకున్నా, కంగనా రనౌత్‌ బాలీవుడ్‌ ‘క్వీన్‌’ అయింది. ఎక్కడో మారు మూల ప్రాంతం నుంచి బాలీవుడ్‌కి వచ్చి అక్కడ నిలదొక్కుకోవడానికి కంటికి కనిపించని శత్రువులతో పెద్ద యుద్ధమే చేసింది. అందుకే ఆమె జీవితం వడ్డించిన విస్తరో, పూల పాన్పో కానే కాదు. అయితే ఈమె పై పలు ఆరోపణలు వస్తున్నాయి. నా అనుకున్న వాళ్ళే ఇలా చేస్తున్నారని ఆమె ఆవేదన చెందుతోంది. ప్రేమించామన్నవారూ, స్నేహం నటించిన వారూ మాటల తూటాలు వదులుతుంటే కొండంత బాధను కడుపులో దాచుకుని, పైకి నవ్వుతూ కనిపిస్తోంది ఈ భామ.

ఇవి కూడా చదవండి:నిహారిక 'ఒక మనసు' టీజర్

హృతిక్‌రోషన్‌తో వివాదం గురించి ప్రస్తావిస్తే, ఇది పేపర్లకు ఎక్కి రచ్చ చేసుకోవలసిన వివాదం కాకపోయినా పరిస్థితుల కారణంగా మా వివాదం పెద్ద గొడవ కింద మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. "మా ఇద్దరికీ సన్నిహితులైన వారు కల్పించుకుని మా వివాదాన్ని సెటిల్‌ చేశారు. ఇక నుంచీ దీనిమీద ఎలాంటి ప్రకటనలూ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాం" అని ఆమె చెప్పింది. ఇక చేతబడులు చేసిందంటూ హీరో అధ్యాన్‌ సుమన్‌ ఆరోపంచడం పై కంగన స్పందిస్తూ, "నేను ఎంత మారుమూల ప్రాంతం నుంచి వచ్చినా చేతబడులు చేసే దానిలా కనిపిస్తున్నానా? ఆ హీరో చెప్పగానే నమ్మేస్తారా? నేను పూజలు, చేత బడులు చేశానని అంటున్నారుగా? మరి ఆ విషయం నా చుట్టుపక్కల ఉండే కొందరికైనా తెలిసే అవకాశం ఉంటుందిగా? అలాంటివి చేస్తే వారు ఊరుకుంటారా? ఇంత చిన్న విషయం కూడా ఆ హీరోగారికి తట్టలేదెందుకో నాకు అర్థం కాలేదు" అంటూ గట్టిగా డోస్ ఇచ్చుకుంది.

ఇవి కూడా చదవండి:ఈ చిన్నారి ప్రశ్నలకు సూపర్ స్టార్ షాక్

ఇవి కూడా చదవండి:బన్నీ పై సీరియస్ అయిన స్నేహ

English summary

Bollywood Queen Kangana Ranauth said that some were making everything controversial in her life and she says that the Fight With Hrithik was settled with their common friends .