స్టార్ హీరోయిన్ కు కారు ప్రమాదం..

Kangana Ranaut car get accident

12:23 PM ON 17th October, 2016 By Mirchi Vilas

Kangana Ranaut car get accident

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఓ కారు ప్రమాదంలో గాయపడింది. యూఎస్ లోని అట్లాంటాలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి, ఫెన్సింగ్ ని ఢీ కొందని, ఈ ఘటనలో ఆమె స్వల్పంగా గాయపడిందని తెలుస్తోంది. హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్న 'సిమ్రాన్' చిత్రంలో కంగనా నటిస్తోంది. కారు డ్రైవర్ కు విపరీతంగా దగ్గు రావడంతో కారు అదుపు తప్పిందని, అదే సమయంలో కంగనా బాడీ గార్డు అతని నుంచి స్టీరింగ్ తీసుకుని దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించబోగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. అయితే ఈ మూవీ షూటింగ్ సందర్భంగా కంగనా గాయపడినట్టు కూడా వార్తలు వచ్చాయి.

ఏమైనా ఆమె క్షేమంగానే ఉందని తెలుసుకున్న ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఈ నెల 12న షూటింగ్ ముగించుకుని ఈ సినిమా యూనిట్ తాము బస చేసిన హోటల్ కు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాద ఘటన జరిగినట్టు చెబుతున్నారు.

English summary

Kangana Ranaut car get accident