క్షుద్ర పూజలు చేస్తూ దొరికేసిన హీరోయిన్

Kangana Ranaut doing kshudra pujalu

09:34 AM ON 29th April, 2016 By Mirchi Vilas

Kangana Ranaut doing kshudra pujalu

బాలీవుడ్ లో ఇప్పుడు ఓ హర్రర్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. హృతిక్ రోషన్ - కంగనా రనౌత్ ల మధ్య గొడవ ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్న టైం ఇది. నెలన్నర పాటు తెగ తిట్టేసుకుని ఇక రెండు వైపుల నుంచి ఎలాంటి పబ్లిక్ స్టేట్ మెంట్లు ఇవ్వబోమని కూడా ఓ స్టేట్ మెంట్ వచ్చింది. ఈ టైంలో.. కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ సంచలనం అవుతున్నాయి. కంగనా చేతబడులు కూడా చేయించిందంటూ అధ్యయన్ సుమన్ చెప్పిన మాటలు.. సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. మోడల్ శేఖర్ సుమన్ కొడుకే ఈ అధ్యయన్ సుమన్. హృతిక్ కంటే ముందు ఏడాది పాటు కంగనాతో డేటింగ్ చేసిన ఎక్స్ పీరియన్స్ ఇతగాడికి ఉంది.

ఇది కూడా చదవండి: డ్రగ్స్ దందాలో చిక్కుకున్న టాప్ హీరోయిన్

ఇప్పుడు పరిస్థితులన్నీ చూసిన తర్వాత తాను హృతిక్ రోషన్ పై జాలి పడుతున్నానంటున్నాడు అధ్యయన్. హృతిక్ తరఫున ఎవరైనా నోరు తెరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాడట. ఇందుకు.. కంగనాతో రిలేషన్ సమయంలో తను ఎదురుచూసిన పరిస్థితులే కారణం అంటున్నాడు. ఇకపోతే అప్పట్లో ఓ పార్టీలో ఆమెతో ఎవరో మిస్ బిహేవ్ చేశారని కంగన చెప్పిందట. దీన్ని అంతగా పట్టించుకోకుండా.. వెళ్దాం పద అనడంతో.. లాగి పెట్టి కొట్టిందని ఆ దెబ్బకు తాను ఏడ్చేశానని చెప్పాడు అధ్యయన్. అంతే కాదు.. కంగనకు క్షుద్రపూజలు, చేతబడుల్లాంటివి కూడా చేయించే అలవాటు ఉందని చెప్పాడు.

ఇది కూడా చదవండి: గేమ్ ఆడుకుంటుంటే అడ్డోచిందని కూతురి ప్రాణాలు తీసిన తండ్రి

తనను ఓ రాత్రి చీకటి గదిలో ఇలాంటి పూజలు చేయమని బలవంతపెట్టిందట కూడా.. హృతిక్ రోషన్ తో మెసేజింగ్ చేసేదని.. ఫోన్ మార్చినపుడు ఆ మెసేజ్ లను మాత్రమే సేవ్ చేసుకుని.. కొత్త ఫోన్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవడం గమనించానని అధ్యయన్ అంటున్నాడు. మొత్తానికి ఆమె వేధింపుల బారిన ఇప్పుడు హృతిక్ రోషన్ పడ్డంతో.. కంగనా మాజీ లవర్ అధ్యయన్ సుమన్ తెగ జాలి పడిపోతున్నాడు. మొత్తానికి ఈ వార్త నెట్ లో వైరల్ అవుతోంది.

English summary

Kangana Ranaut doing kshudra pujalu. Bollywood beauty Kangana Ranaut doing Kshudra Pujalu and Chethabadi.