ఈ బ్యూటీకి స్నానం అంటే గిట్టదట...

Kangana Ranaut don't like to bath

12:00 PM ON 11th August, 2016 By Mirchi Vilas

Kangana Ranaut don't like to bath

ఒక్కొక్కళ్ళకు ఒక్కో రకమైన హాబీ ఉంటుంది. అలాగే కొన్ని అంటే అస్సలు గిట్టవు. మరి తన సోయగాలతో కుర్రకారు కళ్లు కట్టిపడేసిన బ్యూటీ కంగనా రనౌత్ కి అస్సలు స్నానం అంటేనే గిట్టదట. నటనతో పాటు.. అందాన్ని కూడా సమపాళ్లలో రంగరించి ఈ క్వీన్ వెండితెరపై మెరిస్తే, అభిమానులకు పండగే పండగ. స్క్రీన్ పై ఎప్పుడూ మిలమిల మెరిసే ఈ హాట్ భామకు మురికిగా ఉండటం మహా ఇష్టమట. ఓసారి ఆ వివరాల్లోకి వెళదాం. స్వచ్ఛ భారత్ పై తీసిన అభియాన్ పై తీసిన షార్ట్ ఫిలింను కంగనా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవంలో అమ్మడు తన పరిశుభ్రత గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కొన్నాళ్ల వరకూ స్నానం అంటే మహా చిరాకుపడేదాన్నని, తాను ఎంతో సోమరిగా ఉండేదాన్నని తెలిపింది. ఆరోగ్యం గురించి అస్సలు పట్టింపు ఉండేది కాదని, మంచి స్నేహితులు కూడా ఉండేవాళ్లు కాదని చెప్పింది. అయితే, ఇలాంటి పరిస్థితుల్లోంచే చాలా విషయాలు నేర్చుకున్నానని, వేదాంతం చదివానని, స్వామి వివేకానంద మార్గాన్ని అనుసరించడం మొదలుపెట్టాక పరిశుభ్రత అవసరం తెలిసొచ్చిందని వివరించింది. అప్పటినుంచే తన జీవితంలో మౌలిక మార్పులు జరిగాయని తెలిపింది. మొత్తానికి శుభ్రత విషయంలో అదరగొట్టేస్తోంది.

English summary

Kangana Ranaut don't like to bath