నన్ను చంపబోయాడన్న కన్నయ్య

Kanhaiya says that a man attacked him on plane

11:37 AM ON 25th April, 2016 By Mirchi Vilas

Kanhaiya says that a man attacked him on plane

జెట్ ఎయిర్ వేస్ ప్లేన్ లో ఓ వ్యక్తి తన గొంతు నులిమి తన పై హత్యాయత్నం చేశాడని ఢిల్లీ జెఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ తెలిపాడు. ముంబై-పూణే విమానంలో ఈ ఘటన జరిగిందన్నాడు. అకారణంగా తన పై హత్యాయత్నం జరిగిందని పేర్కొన్న కన్హయ్య.. తన మీద దాడికి దిగిన వ్యక్తిపై జెట్ ఎయిర్ వేస్ ఎలాంటి చర్య తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. కాగా కన్హయ్య పై దాడి చేసిన వ్యక్తిని బీజేపీ కార్యకర్త మనాస్ జ్యోతి డేకా గా గుర్తించారు. జెట్ ఎయిర్ వేస్ ఈ ఘటనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోగా. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యతనిస్తామని తెలిపింది. సెక్యూరిటీ కారణాల దృష్ట్యా కొందరు ప్రయాణికులను ముంబై ఎయిర్ పోర్టులోనే దించివేసినట్టు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

చీఫ్ జస్టీస్ కంట తడి

బోర్ కొడుతోంది ... కంపెనీ ఇవ్వరూ

English summary

Delhi JNU Student Leader Kanhaiya says that a Man Attacked him on Plane which was travelling to Mumbai To Pune. He said that Air ways does not bother his words.