ఆ సినీ నటి మరణం .. అనుమానాస్పదం

Kannada Actress Found Dead Doubtfully

11:41 AM ON 11th January, 2017 By Mirchi Vilas

Kannada Actress Found Dead Doubtfully

రోజులు ఎలా వున్నాయంటే, ఉదయం బయటకు వెళ్తే, సాయంత్రం క్షేయంగా ఇంటికి వెళ్తామనే గ్యారంటీ లేదు. సరిగ్గా ఓ సినీ నటి విషయంలో ఇలానే జరిగింది. ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆ నటి సాయంత్రం 5:30 షూటింగ్ ముగిసేటప్పటికి కనిపించలేదు. వెంటనే అలెర్టయిన చిత్ర బృందం ఆమె కోసం చుట్టు పక్కల అంతా గాలించరు. చివరికి నిర్మాణంలో ఓ భవనంలో ఆవిడ మృతదేహం కనిపించింది. పూర్తివివరాల్లోకి వెళ్తే, దనుష్ తమిళ చిత్రం ‘వీఐపీ’కి రీమేక్‌గా కన్నడలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యలహంకలో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో సోమవారం దాదాపు 120 మందితో చిత్రీకరణ జరుగుతోంది. ఆ చిత్రంలో నటిస్తున్న పద్మావతి అనే జూనియర్ ఆర్టిస్టు ఒక్క సారిగా షూటింగ్ స్పాట్‌లో నుంచి కనిపించకుండా పోయింది. దీంతో కంగారు పడిన చిత్ర బృందం, ఆమె కోసం వెతకగా నిర్మాణంలో ఉన్న భవనంలో ఆవిడ మృతదేహం దొరికింది. ఇదిలా ఉండగా పద్మావతి కనిపించడంలేదనే ఫిర్యాదు తమకు రాత్రి 9 గంటలకు వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆవిడ స్నేహితురాలు కూడా పద్మ 3 గంటల నుంచే కనిపించడంలేదని వివరణ ఇచ్చింది. దీంతో పద్మావతి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: రోజా జబర్దస్త్ లో మెగా స్టార్ ఖైదీ ఎలా అయ్యాడు

ఇవి కూడా చదవండి:ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో సంచలనమే!

English summary

Kannada Actress Padmavathi found dead doubtfully in near by construction building. Kqannada Police filed case on this incident and they were investigating this case.