'ఐసియూ'లో కన్నడ హీరోయిన్‌!

Kannada actress Ragini Dwivedi in ICU

02:56 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Kannada actress Ragini Dwivedi in ICU

కన్నడ స్టార్‌ హీరోయిన్‌ రాగిణీ ద్వివేది విపరీతమైన కడుపు నొప్పి వలన ఒక ప్రెవైట్‌ హాస్పటల్‌లో చేరింది. తనని పరిశీలించిన డాక్టర్లు తన కడుపు నొప్పికి గల కారణం ఫుడ్‌ పోయిజన్‌ అని చెప్పారు. ఇటీవలే హీరోయిన్‌ రాగిణీ పై బెంగుళూరు జేపీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదయింది. ఒక చిత్రానికై రాగిణీ అడ్వాన్స్‌గా పారితోషికం 16 లక్షలు నిర్మాత దగ్గర తీసుకుంది. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం షూటింగ్‌ అర్ధాంతరంగా నిలిచిపోయింది. అందువల్ల తను ఇచ్చిన 16 లక్షలు తిరిగి ఇచ్చేయమని నిర్మాత రాగిణీని కోరాడు.

అయితే ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి రాగిణీ నిరాకరించడంతో నిర్మాత రాగిణీ పై కేసు ఫైల్‌ చేయించాడు. రాగిణీ పై విచారణ చేస్తామని పోలీసులు నిర్మాత వెంకటేష్‌కి చెప్పారు. పోలీస్‌ విచారణకి భయపడిన రాగిణీ ఈ విధంగా హాస్పటల్‌ డ్రామా ఆడుతుందని వెంకటేష్‌ అంటున్నాడు. మరో పక్క రాగిణీ అభిమానులు తను కోలుకోవాలని దేవుడికి పూజలు చేస్తున్నారు.

English summary

Kannada actress Ragini Dwivedi in private hospital ICU due to severe stomach pain and it causes because of food poison.