స్టార్ హీరో ఇల్లు కూల్చేస్తామని అధికారులు వార్నింగ్!

Kannada star hero Darshan's house to be demolished

03:42 PM ON 15th October, 2016 By Mirchi Vilas

Kannada star hero Darshan's house to be demolished

బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ లోని రాజకాలువపై అక్రమంగా నిర్మించుకున్న ఇంటిని సొంతంగా తొలగించుకోవాలని, లేని పక్షంలో అక్టోబర్ 22న ఇంటిని తామే కూల్చివేస్తామని కన్నడ స్టార్ హీరో దర్శన్ కు బెంగళూరు అర్బన్ జిల్లా అధికారులు తుది హెచ్చరికలు జారీ చేశారు. దర్శన్ ఇంటితో పాటు మాజీ మంత్రి శ్యామనూరు శివశంకరప్పకు చెందిన హాస్పిటల్ ని కూడా కూల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అలానే.. కాలువ సమీపంలో అక్రమంగా నిర్మించుకున్న మరో 67 కట్టడాలను కూడా కూల్చివేస్తామని చెప్పారు. 2 నెలల క్రితం జరిపిన ఓ సర్వేలో.. రాజకాలువపై ను కబ్జా చేసి ఐడియల్ హోమ్స్ లేఔట్ వేసిందనే నిజాలు వెలుగులోకి రావడంతో.. ఈ కబ్జా వల్ల చిన్నపాటి వర్షాలకే ఆ ప్రాంతంలో వరదలు వస్తున్నాయని సర్వే స్పష్టం చేసింది.

దీనితో హుటాహుటిన రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం.. కాలువపై నిర్మించిన అక్రమ నిర్మాణాల నిర్మూలనకు నడుం బిగించింది. అక్రమ నిర్మాణాల నిర్మూలనలో ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.

English summary

Kannada star hero Darshan's house to be demolished