క్రికెటర్ల సంపాదనపై కపిల్ సంచలన వ్యాఖ్యలు

Kapil Dev Says Cricket is a career option

12:40 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Kapil Dev Says Cricket is a career option

టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసాయి. ముఖ్యంగా క్రికెటర్ల సంపాదనపై చేసిన కామెంట్ ఆకట్టుకుంటోంది.క్రికెట్‌ను ఓ కెరీర్ ఆప్షన్‌గా ఎంచుకోమని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు క్రికెట్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాందించే అవకాశం రావడం ఎంతో మంచి పరిణామమే. కాలంతో పాటు ప్రపంచ క్రికెట్లో ఎన్నో మార్పులు వచ్చాయి. పిల్లలకు చదువుపై ఆసక్తి లేకపోతే కనీసం క్రికెట్ ఆడాలి. సచిన్ టెండూల్కర్ లేదా రాహుల్ ద్రవిడ్ వంటి గొప్ప క్రికెటర్ కావాలి. ఇక స్పోర్ట్స్ అభివృద్ధికి అవసరమైన మౌళిక సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించాలి. మైదానాలతో పాటు ఆటలకు సంబంధించిన అన్ని వస్తువులపై పన్ను తగ్గించాలి ' అని పేర్కొన్నాడు. ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ గ్లోబల్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో కపిల్ దేవ్ పాల్గొని మాట్లాడాడు. 'ఓ క్రికెటర్ 40 రోజుల్లో 10 కోట్ల రూపాయలను సంపాదించగలుగుతున్నాడు' అంటూ పరోక్షంగా ఐపీఎల్‌ను ఉద్దేశించి కపిల్ అన్నాడు.

English summary

Former India captain and 1983 World Cup Winning Team Captain Kapil Dev said rise of cricket as a career option for youngsters, saying that parents now encourage their children to take up the game to earn a living. “Now a cricketer can earn Rs 10 crore for playing in just 40 days only.