మోడీ గారూ ఇదేం పాలన... కమెడియన్ సంచలన వ్యాఖ్యలు!

Kapil Sharma questioned Narendra Modi about his ruling

02:56 PM ON 9th September, 2016 By Mirchi Vilas

Kapil Sharma questioned Narendra Modi about his ruling

ఎవరూ చేయని సాహసమే మరొకటో తెలియదు గానీ, ప్రధాని మోడీపై ప్రముఖ కమెడియన్, టీవీ వ్యాఖ్యాత కపిల్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రభుత్వ కార్యాలయంలో పనికోసం వెళ్లిన కపిల్ కు చేదు అనుభవం ఎదురవడంతో ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై మండిపడ్డాడు. ఇంతకీ ఏం జరిగిందంటే... తన ఆఫీసు పని నిమిత్తం ముంబయిలోని ఓ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన కపిల్ కు చేదు అనుభవం ఎదురైంది. కపిల్ ని అక్కడి అధికారులు లంచం అడిగారట. దీంతో ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు.

'ఆదాయ పన్ను కింద గత ఐదేళ్లుగా రూ.15 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నా. అయినా సరే నా ఆఫీస్ ను నడిపేందుకు ఇప్పుడు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కు రూ. 5లక్షల లంచం ఇవ్వాలట. మోదీ గారు ఇదేనా మీ అచ్ఛేదిన్?' అంటూ కపిల్ ప్రశ్నించాడు.

ఇది కూడా చదవండి: తాను చనిపోతూ 10 మంది ప్రాణాలు కాపాడిన 'బొబ్బా స్నేహామృత'

ఇది కూడా చదవండి: పోర్న్ సైట్ లో విజయవాడ అమ్మాయి నగ్న వీడియో

ఇది కూడా చదవండి: స్టూడెంట్సే కదా అని క్లోజ్ గా ఉంటే టీచర్ కి చుక్కలు చూపించారు(వీడియో)

English summary

Kapil Sharma questioned Narendra Modi about his ruling.