పవన్ తీరుపై కాపు నేతలకు ఆగ్రహం

Kapu Leaders angry on Pawan Kalyan

11:15 AM ON 1st September, 2016 By Mirchi Vilas

Kapu Leaders angry on Pawan Kalyan

రాజకీయాలంటే మామూలుగా ఉండవ్. సినిమా వేరు, రాజకీయం వేరు. రాజకీయాల్లో నెగ్గుకు రావడం అంటే అంత ఈజీ కాదన్న విషయం ప్రజారాజ్యం పార్టీ పెట్టి, చేతులు కాల్చుకున్న మెగాస్టార్ చిరంజీవికి బానే తెలుసు. అయితే చిరు తమ్ముడు మాత్రం ఇప్పుడు పాలిటిక్స్ పై దృష్టి పెట్టి అందరినీ గెలవాలని అనుకుంటున్నాడు. అందుకే నాకు కులం ఏమిటి.. నాకు కులాన్ని అంటగడుతున్నారు. నాకు కులం లేదు - ప్రాంతం లేదు - మతం లేదు.. అంటూ తిరుపతిలో జరిగిన సభలో పవన్ కల్యాణ్ ఆవేశంగా ప్రసంగించినప్పుడు అభిమానులు ఈలలు వేస్తూ చప్పట్లు కొట్టారు. కానీ ఆ వ్యాఖ్యలు కాపు కుల పెద్దలకు మాత్రం ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

తనకు కులమే అక్కర్లేదు తనకు కులమే లేదు అంటూ పవన్ కల్యాణ్ మాట్లాడడం సబబు కాదని కాపు ఉద్యమ నాయకులు గుర్రుగా ఉన్నారుట. కాపు ఉద్యమం గురించి డిసైడ్ చేయడానికి హైదరాబాదులో రెండురోజులుగా ఆ కులానికి చెందిన పెద్దలను కలుస్తున్న ముద్రగడ పద్మనాభంతో సంభాషణల్లో ఈ భావాలు వ్యక్తం అవుతున్నాయిట. కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాజమండ్రిలో సెప్టెంబరు 11న కుల నాయకులందరితో ముద్రగడ పద్మనాభం ఓ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి కాస్త విభిన్నంగా దాసరి వంటి వాళ్లందరి దగ్గరకు వచ్చి వారిని తాను స్వయంగా ఆహ్వానించి వారందరి మద్దతును కూడా కూడగట్టుకుంటున్నారు.

ఆ నేపథ్యంలోనే హైదరాబాదులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కాపు పెద్దలు - దాసరి - చిరంజీవి తదితరులతో సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తున్నది. తనకు కులం లేదు - మతం లేదు.. నన్ను ఒక కులానికి పరిమితం చేస్తారా అంటూ మాట్లాడడం పవన్ కు తగదని కాపునేతలు వ్యాఖ్యానించినట్లు సమాచారం. కావలిస్తే.. కులాలకు అతీతంగా ప్రత్యేకహోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉంది అని ఆయన పిలుపు ఇచ్చి ఉండొచ్చునని దాన్ని అందరూ సమర్థించి ఉండేవాళ్లమని అన్నారుట. మొత్తానికి పవన్ తనను విశ్వమానవుడిగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్న ప్రయత్నం, పవన్ సామాజిక వర్గానికి కోపం తెప్పించినట్లుందని జనం అనుకుంటున్నారు. మరి సెప్టెంబర్ 9న కాకినాడలో పెట్టే సభలో పవన్ తీరు ఎలా ఉంటుందో చూడాలి.

ఇది కూడా చదవండి: 'జనతా గ్యారేజ్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: 'పక్కా లోకల్' అంటూ కాజల్ ఇరగదీసింది(వీడియో)

ఇది కూడా చదవండి: జనతాగ్యారేజ్ లో ప్రిన్స్

English summary

Kapu Leaders angry on Pawan Kalyan. Kapu caste leaders angry on Pawan Kalyan speech in Tirupati.