ముద్రగడకు సపోర్ట్ గా ఏకమయిన నేతలు

Kapu Leaders Fires On Chandrababu Naidu

11:05 AM ON 14th June, 2016 By Mirchi Vilas

Kapu Leaders Fires On Chandrababu Naidu

ముద్రగడ దీక్షపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని కాపు నేతలు తప్పుబట్టారు. ఈయనకు కాపు ప్రముఖులు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే వారితో చర్చించి పరిష్కారాన్ని చూపాలని కోరుతున్నారు. ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష నేపథ్యంలో కాపు నేతలు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో సమావేశమయ్యారు. సమావేశంలో చిరంజీవి, దాసరి నారాయణరావు, బొత్స, పళ్లంరాజు, సి రామచంద్రయ్య పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

ఈ సందర్భంగా చిరంజీవి, దాసరినారాయణ రావు, తదితరులు మీడియాతో మాట్లాడారు. కాపు రిజర్వేషన్ల అంశంపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడకు ఏమైనా అయితే తీవ్ర పరిణామాలు తప్పవని చిరంజీవి హెచ్చరించారు. ముద్రగడ కుటుంబసభ్యులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు.

ముద్రగడను పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళనతోనే తామంతా సమావేశమయ్యామని దాసరి నారాయణరావు పేర్కొంటూ, ఒక జాతి పట్ల, ఒక నాయకుడి పట్ల చూపుతున్న వివక్ష బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని సమర్థించే వాళ్లపై బురద చల్లించాలని ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి బురదజల్లే కార్యక్రమాలు మొదలుపెడితే, దానికి తమ దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయని దాసరి హెచ్చరించారు. పరిస్థితి ముదిరిపోకుండా ప్రభుత్వం తక్షణం స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:కెసిఆర్ - జగన్ మగాళ్ళు అంటున్న చోటా (వీడియో)

ఇవి కూడా చదవండి:బాబు గారి పై మరోసారి విరుచుకుపడిన జోగయ్య

English summary

Kapu Leaders Chiranjeevi,Dasari Narayana Rao,C.Rama Chandrayya,Botsa Satyanarayana and few Kapu leader were met in a Meeting in Hyderabad and discussed about Mudragada Padmanabham. And later they have warned Andhra Pradesh Chief Minister Nara ChandraBabu Naidu.