అనుష్క కెరీర్ ను సర్వనాశనం చెయ్యాలనుకున్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకౌతారు!

Karan Johar want to ravage the Anushka Sharma's carrier

11:16 AM ON 25th October, 2016 By Mirchi Vilas

Karan Johar want to ravage the Anushka Sharma's carrier

టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే చాలాకష్టం. ఒక్కోసారి పరిస్థితులు కల్సి రాకపోతే దెబ్బ పడిపోతుంది. ఇక కెరీర్ సర్వనాశనం అవుతుంది. సరిగ్గా బాలీవుడ్ నటి అనుష్క శర్మ విషయంలో ఇలా చేయడానికి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్రయత్నం చేసాడు. పైగా ఈ సంచలన వ్యాఖ్యలు కూడా అతనే చేశాడు. మామి చలనచిత్రోత్సవంలో పాల్గొన్న కరణ్.. అనుష్క కెరీర్ ను సర్వనాశనం చేయాలని అనుకున్నట్టు చెప్పేసాడు. అయితే ఆ తర్వాత మంచి టాలెంట్ ఉన్న ఆమె కెరీర్ ను నాశనం చేయాలని భావించి, తప్పు చేశానని అనుకున్నానని, వెంటనే ఆమెను కలిసి క్షమాపణలు కూడా చెప్పానని వివరించాడు.

1/4 Pages

యశ్ రాజ్ ఫిలింస్ ఉపాధ్యక్షుడు ఆదిత్య చోప్రా 'బ్యాండ్ బాజా బారాత్' సినిమా చేస్తున్నప్పుడు అనుష్క శర్మను తీసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని కరణ్ వద్ద ప్రస్తావించాడు. ఆమెనెందుకు తీసుకుంటావ్? నీకేమన్నా పిచ్చా? కావాలంటే మరో హీరోయిన్ ను తీసుకో అని కరణ్.. ఆదిత్యకు సూచించాడు. అయితే కరణ్ మాటను లెక్కచేయని ఆదిత్య.. అనుష్కనే తీసుకున్నాడు.

English summary

Karan Johar want to ravage the Anushka Sharma's carrier