అన్నీ వున్నా ... అదొక్కటే తక్కువ ...

Karan Johar Wants To Act In A Film

09:47 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Karan Johar Wants To Act In A Film

దర్శకుడిగా అతడి మొదటి చిత్రం మంచి హిట్. పైగా తొలి ప్రయత్నంలోనే రెండు ఫిలింఫేర్‌ బహుమతులు .... ఇంకా చెప్పాలంటే, తండ్రి యష్‌ జోహార్‌ పేరు మోసిన నిర్మాత. యితడు కూడా అభిరుచి గల ఒక మంచి నిర్మాత. అంతే కాదు మంచి సినేరియో రాయగల నేర్పరి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌, టెలివిజన్‌ టైకూన్‌ కూడా. అతణ్ణి బాలీవుడ్‌ పరిశ్రమ ‘‘జో’’ అంటూ ముద్దుగా పిలుచుకుంటుంది. ప్రతిష్టాత్మక ధర్మా ప్రొడక్షన్స్‌కు అతడు అధిపతి. అతడే కరణ్‌జోహర్‌.... ఇన్ని రంగాల్లో ప్రతిభ, వ్యాపారంలో మెళుకువలు తెలిసినా, నటనలో అంతగా రాణించలేదు. దర్శకుడిగా మొదటి చిత్రం ‘‘కుచ్‌ కుచ్‌ హోతా హై’’ రెండు ఫిలింఫేర్‌ బహుమతులు కరణ్‌ ఖాతాలో జమ చేసుకున్నాడు.

తర్వాత వచ్చిన ‘‘కభి ఖుషి కభి ఘమ్‌’’, ‘‘కభి అల్విద నా కెహనా’’లతో హ్యాట్రిక్‌ విజయాలు సొంతం చేసుకున్నాడు. నటుడిగా కూడా నిరూపించుకోవాలని ‘‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’’ సినిమాలో షారుఖ్‌ ఖాన్‌కు స్నేహితునిగా నటించాడు. తర్వాత ‘‘ఓం శాంతి ఓం’’, ‘‘ఫ్యాషన్‌’’, ‘‘లక్కి చాన్స్‌’’ సినిమాలలో చిన్న పాత్రలు పోషించాడు. తర్వాత అనురాగ్‌ కశ్యప్‌ నిర్మించిన ‘‘బాంబే వెల్వెట్‌’’లో కంబట్టా అనే పూర్తిస్థాయి విలన్‌ పాత్రలో నటించాడు. ఆ సినిమా బోల్తా కొట్టింది. అంతే... ఇక సినిమాలలో వేషాలు వేస్తే ఒట్టు! మార్చి 18న విడుదల కానున్న సొంతచిత్రం ‘‘కపూర్‌ అండ్‌ సన్స్‌’’లో దర్శకుడు షకూన్‌ బాత్రా ఏదైనా పాత్ర ఇస్తాడేమోనని చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. మరి హీరో పాత్ర ఎలాగూరాదు, కనీసం సహాయ నటుడిగానైనా రాణించాలని వుందని ఆవేదన తో చెబుతున్న కరణ్ , నిర్మిస్తున్న ‘‘కపూర్‌ అండ్‌ సన్స్‌’’లో సిద్దార్థ మల్హోత్రా, ఆలియాభట్‌, ఫవాద్‌ ఖాన్‌, రిషికపూర్‌, రజత్‌ కపూర్‌, రత్న పాథక్‌ షా నటిస్తున్నారు. ‘‘ఎప్పటి¹కైనా క్యారక్టర్‌ నటుడిగా పేరు తెచ్చుకుంటా’’ అంటూ ప్రతిన పూనాడట కరణ్‌! అయితే ఇదంతా ఒట్టి జోక్ గా కొట్టి పారేసాడు కరణ్. అన్నీ వున్నా... కాలం కల్సి రాక ఇలా నటుడిగా రాణించాలన్న ఆతృత పడుతున్న కరణ్ కోరిక ఎప్పటికి ఫలించేనో కదా....

English summary