కార్బన్‌ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్

Karbonn K9 Smart Phone Launched

05:11 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Karbonn K9 Smart Phone Launched

ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ కార్బన్‌ మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. కే9 స్మార్ట్‌ పేరుతో దీనిని విడుదల చేసింది. దీని ధర రూ.3,990. 21 భారతీయ భాషలను సపోర్ట్‌ చేసే ఈ ఫోన్ రిటైల్‌ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ సిస్టమ్‌ లెవల్‌లో 12 భాషలను.. ఫోన్‌ కాంటాక్ట్స్‌ను 11 భాషల్లో భద్రపరుచుకోవచ్చు. కీబోర్డులో టైప్‌ చేయడానికి వినియోగదారులు 21 భాషల నుంచి దేన్నైనా ఎంచుకోవచ్చు. 5 అంగుళాల తాకే తెర, 1.2 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌, 1.3 ఎంపీ ముందు కెమెరా, 3.2 ఎంపీ వెనుక కెమెరా, 512 ఎంబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌ 4.4, 8జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 2300 ఎంఏహెచ్‌ బ్యాటరీ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

English summary

Karbonn has launched a new entry-level smartphone, the K9 Smart, priced at Rs. 3,990. The smartphone is now available via retail stores.