కార్బన్‌ టైటానియం సిరీస్ లో రెండు స్మార్ట్‌ ఫోన్లు 

Karbonn Titanium S205 Launched

06:52 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Karbonn Titanium S205 Launched

ప్రముఖ దేశీయ మొబైల్స్ తయారీ సంస్థ కార్బన్‌ టైటానియం సిరీస్ లో రెండు బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్లను విడుదల చేసింది. టైటానియం మొఘల్‌, టైటానియం ఎస్‌205 2జీబీ పేర్లతో వీటిని మార్కెట్లోకి తెచ్చింది. వీటి ధరలు వరసగా రూ.5,790, రూ.6,790. భారత్‌లోని అన్నిరీటైల్‌ దుకాణాల్లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. ఎస్‌205 మొబైల్‌ ఫోన్‌ని సంస్థ అక్టోబర్ లోనే విడుదల చేసినప్పటికీ కొనుగోళ్ల కోసం ఇప్పుడు మార్కెట్లోకి తెచ్చింది.

టైటానియం మొఘల్‌ ఫీచర్లు ఇవీ..

5 అంగుళాలతాకే తెర, 540×960 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, ఆండ్రాయిడ్‌ 4.4 కిట్‌ క్యాట్‌ ఆపరేటింగ్‌ సిస్టం, డ్యూయల్‌ సిమ్‌, 1.2 గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, 1జీబీ ర్యామ్‌, 8 జీబీ అంతర్గత మెమొరీ, ఎస్డీ కార్డుతో 32 జీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం, 8 మెగాపిక్సల్‌ కెమేరా, 3.2 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, 3జీ కనెక్టివిటీ, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

టైటానియం ఎస్‌250 2జీబీ ఫీచర్లు

ఐదు అంగుళాల తాకే తెర, 720×1280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 1.2 గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 16 జీబీ అంతర్గత మెమొరీ, ఎస్డీ కార్డుతో 32 జీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం, 2200ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, 8 మెగాపిక్సల్‌ కెమేరా, 3.2 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary

Mobile Company Karbonn Company Launched a new smart phone called KarbonTitanium S205