అది తింటే మూడ్ ఉల్లాసంగా ఉంటుందట

Kareena Kapoor Launches Magnum Ice Cream

05:25 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Kareena Kapoor Launches Magnum Ice Cream

తన అందంతో మత్తెకించే కరీనా కపూర్ నటించిన తాజా చిత్రం కీ అండ్‌ కా ఏప్రిల్‌ 1న విడుదల కానుంది. ఇటీవల ముంబయిలో ప్రముఖ ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌ ‘మాగ్నమ్‌’ బ్రౌనీ అనే కొత్త ఫ్లేవర్‌ని విడుదల చేసింది ఈ కార్యక్రమంలో కరీనా పాల్గొంది. ఇక అమ్మడు అందరిలా కాకుండా తినాల్సినవన్నీ ఎంచక్కా లాగించేస్తుంది. ఇక ఐస్‌క్రీమ్‌ తింటే లావైపోతామని నటీనటులు తెగ ఫీలైపోతారేమో గానీ కరీనా, మాత్రం దొరికితే వదలదత. ఇక భర్త సైఫ్‌ కూడా అంతేనట. ఈ ఇద్దరికీ ఐస్‌క్రీమ్‌లంటే ఇష్టమని కరీనా అంటోంది. తానైతే చిన్నప్పుడు అమ్మకు తెలియకుండా తన పాకెట్‌మనీతో ఐస్‌క్రీమ్‌ కొనుక్కుని తినేసేదాన్ని అని చెబుతోంది. ఐస్‌క్రీమ్‌ తింటే బరువు పెరుగుతారంటారుగా అని ప్రశ్నిస్తే, 'నన్ను చూస్తే మీకలా అన్పిస్తోందా' అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది. ఇక తన భర్త భర్త సైఫ్‌ అయితే తినడం మొదలుపెడితే ఆపడని, రెండు మూడు తిన్నాక ఆ విషయం గుర్తుచేయాల్సి వస్తుందని తెగ మురిసిపోతూ చెబుతోంది కరీనా.'అలాగే చాకొలెట్‌ తింటే మూడ్‌ ఉల్లాసంగా మారుతుందని, చర్మానికి కూడా మంచిదని, అందుకే ఎప్పుడన్నా ఓసారి తినడంలో తప్పేంలేదని కరీనా ప్రచారం చేస్తోంది.

English summary

Bollywood Top Heroine and Hero Saif Ali Khan Wife Kareena Kapoor launch Magnum ice cream in Indian as she becomes the Brand Ambassador for Magnum Ice Cream.Kareena Says that eating ice cream and chocolate were good to health.